ఈ కామాంధుడు 20 మంది ఆంటీలను మోసం చేశాడు.. పేస్ బుక్ లో పెళ్లై భర్తలు వదిలేసిన ఒంటరి మహిళలే టార్గెట్

0
295

ఒంటరి మహిళలనే టార్గెట్ చేసుకుని వారి జీవితాలతో ఆడుకుంటున్న ఓ ఘరానా మోసగాడిని హైదరాబాద్ లో టాస్క్ పోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లై భర్తకు దూరంగా ఉంటున్న మహిళలను ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకుని ఈ దుండగుడు మోసాలకు పాల్పడుతున్నాడు. అయితే ఇలాగే ఓ అమ్మాయితో పరిచయంపెంచుకుని మోసం చేయగా ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేటుగాడి వేషాలన్ని బైటపడ్డాయి.

వివరాల్లోకి వెళితే… అనంతపూర్ జిల్లాకు చెందిన రంగస్వామి ఐదవ తరగతి వరకే చదువుకున్నాడు. కానీ సామాజిక మాద్యమాలపై బాగా అవగాహన పెంచుకున్నాడు. అయితే ఇతడు ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చాడు. అయితే ఇక్కడ అతడి చదువుతో ఉద్యోగాలు దొరక్కపోవడంతో నేరస్థుడిగా మారాడు. ఇతడిపై పలు పోలీస్ స్టేషన్లలో చైన్ స్నాచింగ్ కేసులున్నాయి. అయితే ఈ నేరాలే కాదు రంగ స్వామి లోని మరో కోణం ఇపుడు బైటపడింది.

ఇతడు తనకున్న ఫేస్ బుక్ పరిజ్ఞానంతో ఒంటరి మహిళలతో పరిచయం పెంచుకుని వారితో చాటింగ్ చేసేవాడు. ఇలా వారితో చనువు పెంచుకుని శారీరకంగా వాడుకుని వదిలేసేవాడు. ఇలా పరిచయమైన దాదాపు 20 మంది అమ్మాయిలను అతడు మోసం చేశాడు. అయితే ఇటీవల ఓ యువతిని ఇలాగే మోసం చేయబోతే ఆమె ఇతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన రాచకొండ ఎస్ఓటీ పోలీసులు రంగస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here