కార్తీకమాసం అంటేనే తెలుగు ప్రజలకు మహా అద్భుతమైన మాసం. అత్యంత మహిమలందించే ఈనెలను చాలా ప్రత్యేకంగా భావిస్తారు. తెలుగు నెలలన్నిటిలోకి ఆధ్యాత్మికంగా కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత మరి యే ఇతర నెలకు లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ నెలలో కింద చెప్పిన విధంగా చేస్తే మీరు అడగకుండానే అన్నీ ఇచ్చేస్తాడట శనీశ్వరుడు.ఇక కార్తీక మాసం అనేది దీపావళి పండుగ ఐపోయిన మరుసటి రోజునుండి మొదలవుతుంది. కార్తీక మాసమంతా తెల్లవారక ముందే లేచి కృత్తికా నక్షత్రం అస్తమించేలోగానే నదులలో గాని, తటాకాలలో గాని, అలాంటివి అందుబాటులో లేనప్పుడు ఇంట్లోని స్నానాల గదిలో తప్పక తలస్నానమాచరించాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది.ఈ విధంగా నిష్ఠ నియమాలతో స్నానంచేసి శివుడిని గాని, విష్ణవును గాని, లేదా మరే మీకు ఇష్ఠమైన దైవాన్నైనా సరే ధ్యానించడం వలన, అర్ఘ్యాదులు ఇవ్వడం వలన కురుక్షేత్రం, గంగానది, పుష్కరతీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సర్వపాపాలు నశించి పుణ్యఫలితాలు అందుతాయని హిందూ పండితులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here