ఆకాశంలో అద్భుతం జరుగనుంది. బుధవారం రాత్రి ఇది కనిపించనుంది. జెమిని తారామండలం నుంచి వచ్చే ఉల్కలను బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు బైనాక్యులర్లు, టెలిస్కోపుల అవసరం లేకుండానే ప్రజలు చూడవచ్చునని కోల్‌కతాలోని ఎంపీ బిర్లా నక్షత్రశాల సంచాలకుడు దేవీప్రసాద్‌ దురై వెల్లడించారు. నగర కాంతులకు దూరంగా.. చీకటి ప్రదేశాలకు వెళ్తే ఉల్కాపాతాన్ని మెరుగ్గా వీక్షించవచ్చునని ఆయన సూచించారు. గురువారం తెల్లవారుజామున రెండు గంటలకు ఉల్కాపాతం తారస్థాయిలో ఉంటుందని దేవీప్రసాద్‌ చెప్పారు. ఈ తరహా ఉల్కాపాతం చాలా అరుదుగా కనిపిస్తుందని ఆయన తెలిపారు.

ఈ ఉల్కాపాతాన్ని చూసేందుకు ప్రత్యేకంగా ఖగోళ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం ఉదయం 2 గంటల వరకు భారీగా ఉల్కలు ఆకాశంలో కనువిందు చేస్తాయని అన్నారు. ఈ ఉల్కలు రాలుతున్న తారల్లా కనిపించనున్నాయి. మిథునరాశి కూటమిలో ఉల్కలు మెరుస్తూ కనిపిస్తాయని, దాదాపు గంటకు 120 వరకు ఉల్కలు పతనం కానున్నాయని తెలిపారు. చీకటి ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి ఉల్కలు స్పష్టంగా కనిపిస్తాయని దురై తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here