ఒక బీర్ తాగినా బీప్..?? 2 3 4 5 ఇలా ఎంత తాగితే ఎన్ని పాయింట్లు వస్తాయో తెలుసుకోండి ..!!

0
240

నేను ఒక్క బీర్‌ తాగితేనే బ్రీత్‌ అనలైజర్‌ బీప్‌.. బీప్‌మన్నది. నువ్వు మాత్రం పెగ్గు తాగినా దొరకలేదేంటీ..?’ అంటూ రంజన్‌ తన స్నేహితుడు రాజీవ్‌తో వాపోయాడు. ఎల్‌బీనగర్‌ కూడలి సమీపంలో రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు కొద్దిరోజుల క్రితం నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో బీర్‌ తాగి చిక్కిన సందర్భంలో రంజన్‌ అన్న మాటలివి. ఇద్దరూ ఒకే బారులో మద్యం తాగి రెండు వాహనాలపై గమ్యస్థానాలకు బయలుదేరారు. బీర్‌ తాగిన రంజన్‌ పోలీసులకు చిక్కాడు. తన స్నేహితుడు రాజీవ్‌ మాత్రం చక్కగా ఇంటికి వెళ్ళిపోయాడు..ఎంత తాగితే ఎన్ని పాయింట్లు వస్తాయి ? ఎన్ని పాయింట్స్ వస్తే ఎలాంటి శిక్షలు విధిస్తారో ఇక్కడ తేలుసుకోండి..

విస్కీ లేదా బ్రాందీ ఒక పెగ్గు(60 ఎంఎల్‌) తాగితే బీఏసీ శాతం 30-40 నమోదయ్యే అవకాశముంటుంది. అదే రెండు పెగ్గులు లోపల పడితే ఆ శాతం 60కి పెరగొచ్చు. మూడు గంటల్లోపు దీని ప్రభావం ఉంటుంది. మూడు గంటలు గడిస్తే దీని ప్రభావం 30శాతం లోపునకు తగ్గే వీలుంది. చాలా మంది టేబుల్‌ ముందు కూర్చుంటే పెగ్గుల మీద పెగ్గులు లాగించిన తర్వాతే ఇంటిముఖం పడుతుంటారు. అందుకే డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో చిక్కిన వారిలో అత్యధికుల బీఏసీ 50-200 శాతం వరకు నమోదవుతోంది. గతంలో కొందరికైతే 450 శాతం నమోదు కావడం పోలీసులకే చుక్కలు చూసినంత పనైంది.

ఒక్క బీర్‌తో బేర్‌… సాధారణంగా ఒక బీరులో 750 మి.లీ.ల మద్యం ఉంటుంది. బీరు తాగి అది రక్తంలో కలిసిపోతే బీఏసీ శాతం 40-50గా నమోదవుతుంది. బీరు తాగిన గంట లోపు డ్రంకెన్‌ డ్రైవ్‌లో చిక్కితే బ్రీత్‌ ఎనలైజర్‌కు దొరికినట్టే. ఒకవేళ తాగడం పూర్తయిన గంట సేపటి తర్వాత చిక్కితే బీఏసీ శాతం 30 వరకు ఉండే అవకాశం ఉండటంతో కొంత మేర తప్పించుకోవచ్చు. అంటే ఒక్క బీరు తాగి బండి నడిపినా బేర్‌మనడం ఖాయమని మీరు గుర్తుంచుకోవాలి.


చీప్‌ లిక్కర్‌తో అయితే మహ చిక్కే.. సాధారణంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ఎక్కువగా చిక్కేది దిగువ మధ్య తరగతి కుటుంబాల వ్యక్తులే. అందుకు కారణం ఎక్కువ ధర గల మద్యం కంటే వారు తాగే చీప్‌ లిక్కర్‌లో ఆల్కహాల్‌ శాతం అధికంగా ఉండటమే. చీప్‌ లిక్కర్‌ ఎక్కువ పెగ్గులు తాగితే రక్తనమూనాల్లో మద్యం శాతం అధికంగా ఉంటుంది. తనిఖీల్లో చిక్కినప్పుడు బీఏసీ శాతం ఎంత ఎక్కువగా ఉంటే న్యాయస్థానాల్లో జైలుశిక్షలు అంత ఎక్కువగా పడుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని న్యాయస్థానాలు 1-60 రోజుల వరకు శిక్షలు విధించాయి. పరిమితికి మించి తక్కువ మోతాదు నమోదైతే జరిమానాలు విధించడంతోపాటు సామాజిక సేవ చేయిస్తున్నారు.సో తాగి వాహనాలు నడిపే ముందు ఎంత తాగేమా అన్నది చూసుకుని డ్రైవ్ చేయండి, జాగ్రత్తగా ఇంటికి చేరండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here