కన్నతల్లికి బ్రతికుండగానే నరకం చూపించిన కొడుకు, హింస భరించలేక ప్రాణాలు విడిచిన తల్లి వీడియో..

0
212

రాజస్థాన్ లోని అల్వార్ అనే ప్రాంతంలో 10 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరినీ కంటతడికి గురి చేస్తోంది. ఈ వీడియోలో కన్నతల్లిని ఇష్టం వచ్చినట్లుగా కొడుతూ చిత్ర హింసలు పెడుతున్న ఇతని పేరు జోగేంద్ర చౌదరి. ఆ ఊర్లోనే ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్నాడు.తన భర్త చనిపోవడంతో అనారోగ్యం బారిన పడటం, కొన్ని రోజుల క్రితమే పక్షవాతం రావటంతో తన పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండటంతో కొడుకు సహాయం కోరుతూ అతడి వద్దకు చేరింది. ఇంట్లో భార్యతో తరచూ ఏదో గొడవ పడుతూ ఆమెపై ఉన్న కోపాన్ని తల్లిపై చూపించేవాడు. ప్రత్యక్ష నరకం చూసిన ఈ నిస్సహాయకురాలు ప్రాణాలు విడిచింది.

తన తండ్రి నానమ్మ గత కొన్ని రోజులుగా హింసిస్తూ ఉండటంతో బాధపడ్డ ఆ మనవడు ఒకరోజు, తన తండ్రి నానమ్మను కొడుతుండగా మనవడు వీడియో తీసి నెట్ లో పెట్టాడు.. ఈ వీడియో అందరికీ చేరేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో స్థానిక పోలీసుల వద్దకు చేరటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కష్టమైనా, నష్టమైనా ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ప్రాణం పోసిన అమ్మకు ఇదేనా మనం ఇచ్చే గౌరవం. అమ్మ కడుపులో నుండి బయటకు వచ్చినందుకే జీవితాంతం రుణపడి ఉండవచ్చు. ఇటువంటివి మళ్ళీ మరొక తల్లికి జరగకుండా అందరికీ షేర్ చేయండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here