హిందూ సంప్రదాయం ప్రకారం మన బందువులు చనిపోయినప్పుడు కాకులకు పిండం పెడతాం. మూడవ రోజు నుండి పదవ రోజు వరకు పక్షులకు అంటే కాకులకు పిండం అంటే ఆహారం పెట్టడం చూస్తూ ఉంటాం. మరణించిన వారు కాకి రూపం లో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు అనే నమ్మకం మన ముత్తతల కాలం నుండే ఉంది. ఈ కారణం గానే ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారం అయింది. కర్మకాండలో బాగంగా కాకులకు అన్నం పెడ్తూ ఉంటారు.ఆ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందారు అని ఒక వేళ కాకి ముట్టక పోయినట్టైతే వారికీ ఇష్టమైన కోరిక ఏదో తాము తీర్చనందువల్ల వాళ్ళ అసంతృప్తి కి గురియ్యారు అనుకుంటారు.

దానికి పురాణంలో ఒక వృతాంతం ఉంది ఎందుకు అంటే రావణబ్రహ్మ నవ గ్రహాలను భందించడానికి వచ్చినప్పుడు రవణుణ్ణి చూసి యమధర్మరాజు బయపడ్తాడు. తనను బంధిస్తాడు అని తెలిసి వేరే దారి లేక అక్కడ కాకి ఉంటే పారిపోయే మార్గం ఉంటే చూపమంటాడు. కాకి తనలో ప్రవేశించమని చెప్తుంది .అల తనలో ప్రవేశించగానే కాకి ఎగిరి దూరంగా రావణబ్రహ్మ నుండి కాపాడుతుంది. అప్పుడు యముడు కాకికి ఒక వరం ఇస్తాడు నీకు ఎవరు అయితే అమావాస్య నాడు కానీ భందువ్లులు చనిపోయిన థిదులో కానీ ఆహారం పెడతారో ఆ ఆహారం నువ్వు తింటే వారి పితృదేవతలు నరకంలో కూడా ఆనందం పొందుతారు. అందు వలన కాకికి ఆహారం పెట్టడం ఆచారంగా వస్తుంది .మనం ఏమైనా వ్రతాలు చేసినప్పుడు కూడా మనం తినక పోయిన మూగా జీవాలకు ఆహారం పెట్టాలి. కాకి శని దేవుని అనుగ్రహం పొందింది కాకికి ఆహారం పెడ్తే శని దేవుని అనుగ్రహం పొందినట్టే. ఇక మరి కొందరి కధనం ప్రకారం కాకి మనకు సంకేతాలు ఇస్తుంది అని నమ్ముతారు. మన పూర్వికులు మనుషుల జీవితం, మరణం కాకి తో ముడి పడినట్లు విశ్వసిస్తారు. చనిపోయిన మన పూర్వికులే కాకి రూపంలో ఉంటారు అని కూడా చాలా మందికి నమ్మకం. శ్రాద్ధ కర్మల సమయంలో కాకి పిండం తింటే చనిపోయిన వారి ఆత్మ సంతృప్తి పొందింది అని కూడా చెప్తూ ఉంటారు.

కాకులు మన భవిష్యత్ ను అంచనా వేస్తాయి అని ఇంట్లో కాకి అరిచిన కొన్ని ప్రదేశాలపై వాలిన, కాకి తాకినా, తన్నిన అది కొన్ని జరగబోయే అంశాలకు సూచకాలు అని కొన్ని నమ్మకాలూ ఉన్నాయి. ఒకవేల మీరు బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిచి వెళ్ళింది అంటే మీరు వెళ్తున్న పని లేదా మీ ప్రయాణం సక్సెస్ అవ్తుంది అని సంకేతం. నీళ్ళు నిండుగా ఉన్న కుండపై కూర్చొని ఉండడం ఎవరు అయితే చూస్తారో వాళ్ళు ధనవంతులు కాబోతున్నారు అని సంకేతం. ఒక వేల కాకి తన నోట్లో రోటి లేదా బ్రెడ్ లేదా మాంసం ముక్క పట్టుకొని వెళ్ళడం చూసారంటే మీరు ఏదో శుభవార్త వినబోతున్నారు అని మంచి జరగబోతుంది అని సంకేతం. ఇంటి దెగ్గర లేదా ఆఫీస్ దెగ్గర లేదా ఒక ఊర్లో అరిస్తే అది అశుభ వార్తకు సంకేతం. అలాగే ఆప్రాంతం ఓనర్ సమస్యల్లో పడతారు అని సంకేతం. ఒక వ్యక్తీ తలపై కాకి వాలితే వాళ్ళు అవమానాల వల్ల సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు అని సంకేతం. ఒక వేల కాకి మహిళా తలపై లేదా ఆమెపై కూర్చుంటే ఆమె భర్త సమస్యల్లో పడతారు అని సూచిస్తుంది. ఒక వేల సాయంత్రం పూట కాకి ఆగ్నేయం వైపు నుండి రావడం చూసారు అంటే ద్రవ్య లాభం పొందుతారు అని సూచనా. ఇంటి దెగ్గర లేదా ఆఫీస్ దెగ్గర లేదా ఒక ఊర్లో కాకి అరిస్తే అది అశుభ వార్త కి సంకేతం. ఇక పిండం ఇవి పలు రకాలు కర్మకాండలకు రకరకాల పిండాలు పెట్టడం హిందూ సంస్కృతీ లో ఉంది. కొందరు మాత్రమే పాటిస్తున్నారు కొందరు రాను రాను విసర్జించి ఉంటారు. కొందరు తొలినాళ్ళ నుంచి పాటించి ఉండకపోవచ్చు వాయుసం పిండం కాకికి పిండం పక్షి జాతికి భోజనం పెట్టడం అనేది ఇందులో పరమార్దం.

పూర్వం మనుషులు నివసించే ప్రాంతాలలో కాకులే ఎక్కువగా జీవించేవి అందుకే మన పూర్వికులు పిండ ప్రదానం చేసిన తర్వాత కాకులకు ఆహారం పెట్టె వారు అదే ఆనవాయితీగా వస్తుంది. చనిపోయిన వారి ఆత్మ పక్షి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుందని కొన్ని శాస్త్రాలలో ఉంది. రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వికులు కాకి రూపంలో విహరిస్తూ ఉంటారు. కాకులకి ఆహారం పెడ్తే నీ పూర్వీకులకు చేరుతుంది అని ఒక వరం ఇస్తాడు. రాముడి వరం ప్రకారమే నేటికి కాకులకి ఆహారం పెడతారు అనే నానుడి కూడా ఉంది. విగ్ర పిండం నీటిలో వదిలే పిండం నీటిలో ఉండే జలచెరాలకు ఆహారాన్ని పెట్టడం అనేది అందులో ఉండే పరమార్దం. చాల మంది చనిపోయిన వారి అస్తికలను నది దెగ్గరకు తీసుకువెళ్లి పిండ ప్రదానం చేసి నదిలో వదిలేస్తారు. అస్తికలతో పాటు ఆహారాన్ని కూడా నదిలో వేస్తారు ఇలా చేస్తే చనిపోయిన వారు ఆత్మకు శాంతి చేకూరుతుంది అని నమ్మకం. గోవుకి పెట్టె పిండం పిండాన్ని గోవులకు పెట్టనియ్యడం లేదు అనే విమర్సు కూడా ఉంది. అది చాలా తప్పు అపోహ కూడా ఆవుకి బలమైన ఆహారం అందించడమే పిండ ప్రదానం లోని గుణం. ఆవులకి పెట్టె పిండాలలో పాలు పాలపదర్దాలయినవి. జంతువు అంటే గోవు మాత్రమేనా ఇంకేం లెవా కుక్కకో పిల్లికో పెట్టవచ్చు కదా అని సందేహం రావచ్చు.వీటికి కూడా సమాదానం లేకపోలేదు ఆవు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మేలుజాతి పశువు అని గుర్తించారు మన పూర్వికులు. అంతే కాదు ప్రతి ఇంటిలో కుక్క ఉన్న లేకపోయినా ఆవు మాత్రం ఉండేది. అందుకే ఆ కాలం వారు సుబిక్షంగా ఉన్నారు అనడంలో సందేహం లేదు అన్నిఇల్లలో ఆవులు ఉంటాయి కాబట్టి వాటికీ కూడా భోజనం పెట్టడమే ముఖ్య ఉద్దేశం. ఇంకా చనిపోయిన వారి పేరిట వారి ఆత్మకు శాంతి చేకూరాలని అని బంధువులకు ఊరి ప్రజలందరికి అన్నదానం చేస్తారు. మన హిందూ ధర్మంలో ఆచరించే ప్రతి ఆచారం వెనుక సైన్సుతో పాటు మనుషుల జీవనానికి ఉపయోగపడే ప్రయోజనాలు ఉన్నాయి అని అందరు తెలుసుకోవలిసిన విషయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here