చక్రవాకం హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో చుస్తే షాక్ అవుతారు..

0
670

వెండితెరపై ఓ సినిమాను రెండు వారాలు ఆడించడానికే నిర్మాతలు నానా తంటాలు పడుతుంటారు. ఫిప్టీడేస్‌కి చేరువైతే ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ కిందే లెక్క. బుల్లితెర పై సీన్ రివర్స్. ఒక సీరియల్ మొదలైందంటే…. వందలకొద్దీ ఎపిసోళ్లు. వెయ్యి దాటిందంటే అదో రికార్డు. సీరియల్‌ తీయడం ఒకెత్తయితే… దాన్ని ప్రేక్షకుల మనసులకు హత్తుకునేలా మార్చడం మరొకెత్తు. ఇందులో వందకు వెయ్యి మార్కులు వేయించుకునే సీరియల్ చక్రవాకం . ఇదంత మామూలు విషయం కాదు. ఈ ఘన కార్యాన్ని సాధించడమే కాదు… వెయ్యి ఎపిసోడ్లకు పైగా పరుగులు పెట్టించి రికార్డ్ సృష్టించింది చక్రవాకం టీం. టీవీ సీరియల్ అనగానే గుర్తుకొచ్చేలా … తెలుగువాకిళ్లలో అందరినోటా నానిన సీరియల్ గా చక్రవాకంకు పేరు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు మంజులా, బిందునాయుడు సిస్టర్స్. చక్రవాకం సీరియల్ 2003 నవంబర్ 3న ప్రారంభమైంది. అక్కడి నుంచీ అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సీరియల్స్ తో మంచి ఇమేజ్ తెచ్చుకున్నా నటి నటుల గురించి ఇపుడు తెలుసుకుందాం .


ఇంద్రనీల్

చక్రవాకం’ హీరో ఇంద్రనీల్ గా అశేష తెలుగు టీవీ ప్రేక్షకులకు బాగా పరిచితుడు. తరువాత మంజులానాయుడి ‘మొగలిరేకులు’ సీరియల్లో కూడా హీరోగా చేశాడు. ఇంద్రనీల్ అలియాస్ రాజేశ్ బాబు పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా గుడివాడలో. చక్రవాకం సీరియల్లో నటిస్తున్నపుడే ఆ సీరియల్లో అత్తగా నటించిన గుజరాతీ అమ్మాయి మేఘనా రమ్మీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ తో పాపులారిటీ వచ్చిన తరువాత చాల సీరియల్స్ ప్రోగ్రామ్స్ తో బిజీ గా ఉన్నాడు.

ప్రీతి అమిన్

చక్రవాకం’ హీరోయిన్ ప్రీతి అమిన్ టీవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ అమ్మడు పుట్టి పెగింది ముంబై, తెలుగు సీరియల్స్ లోనే కాకుండా హిందీ సీరియల్స్ కూడా నటించింది. చక్రవాకం సీరియల్ తో 2006 లో వెస్ట్ యాక్టర్స్ అవార్డు వచ్చింది. ఇక ఆతరువాత ప్రీతి అమిన్ అమెరికాకు చెందిన వ్యక్తి ని పెళ్లి చేసుకొని అమెరికాలోనే సెటిల్ అయిపోయింది.

సెల్వరాజ్

చక్రవాకం సీరియల్ లో ఇక్బాల్ క్యారెక్టర్ లో బాగా నటించి మంచి పేరు తెచ్చుకున్న నటుడు సెల్వరాజ్. ఆ తర్వాత మొగలి రేకులు సీరియల్ లో కూడా లీడ్ రోల్ చేసాడు. ఇక ఆతర్వాత చాల సీరియల్స్, ప్రోగ్రామ్స్ తో బిజీ అయిపోయాడు సెల్వరాజ్.

లిఖిత కామిని

తెలుగు అమ్మాయి అయినా లిఖిత చక్రవాకం సీరియల్ తో బాగా పాపులర్ అయి ఆ తరువాత మొగలి రేకులు సీరియల్ లో కూడా నటించింది. ఇక్క ఆ తర్వాత పెళ్లి చేసుకొని రియల్ లైఫ్ లో బిజీ అయిపోయింది. లిఖిత కు ఒక బాబు కూడా ఉన్నాడు.

శృతి

బుల్లితెరపై చక్రవాకం సీరియల్ లో మహిళా ప్రేక్షకుల్ని మెప్పించిన గొప్పనటి శృతి. మోడలింగ్ నుంచి సీరియల్స్ వరకు తన జీవన ప్రస్థానాన్ని సాగించారు. వందకుపైగా సీరియల్స్‌లో నటించారు . రుతురాగాలు, చక్రవాకం, మొగలిరేకులు, చంద్రముఖి, కన్యాశుల్కం, శ్రావణ సమీరాలు, మమతల కోవెలలోని పాత్రలు మంచి పేరు తెచ్చుకుంది ఈ నటి. ఈమె భర్త మధుసూదన్ కూడా నటుడే, సీరియల్స్ మరియు సినిమాల్లో ఎక్కువగా విల్లన్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇటు బుల్లి తెర అటు వెండి తెరఫై నటిస్తూ బిజీ గా ఉన్నారు ఈ కపుల్స్ .

మేధా

చక్రవాకం సీరియల్ లో మేధా చాల మంచి క్యారెక్టర్ చేసింది. ఆ తర్వాత మొగలి రేకులు సీరియల్ లో కూడా లీడ్ రోల్ చేసి ప్రేక్షకాదరణ పొందింది ఈ అమ్మడు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని బిజీ అయినా కూడా సీరియల్ లో నటిస్తుంది. మేధా కి ఒక బాబు కూడా ఉన్నాడు.

సాగర్

ఈ సీరియల్ తో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు నటుడు సాగర్. చక్రవాకం, మొగలి రేకులు టివి సీరియల్స్ రేపిన సంచలనం మాములుగా లేదు. ఆ తరువాత పలు టివి సీరియల్స్ లో నటించిన సాగర్ హీరోగా ”మాన్ అఫ్ ది మ్యాచ్” సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత సాగర్ హీరోగా సిద్దార్థ అనే సినిమా చేసాడు. ఇక సాగర్ రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకున్నాడు.

పావని

చక్రవాకం సీరియల్ లో ఫ్రెండ్ క్యారెక్టర్ లో అలరించిన నటి పావని. ఈ అమ్మడు సినిమాలు కూడా చేసింది. ఇక్క ఆతర్వాత పెళ్లి చేసుకొని రియల్ లో బిజీ అయిపోయింది , పావనకి ఒక పాపా కూడా ఉంది.

లహరి

చక్రవాకం’ ఇచ్చిన కిక్‌తో కెరీర్‌ వెనక్కి చూడాల్సిన అవసరం లేకుండా ముందుకు వెళ్తుంది లహరి. . ఈ సెరల్ తర్వాత ‘మొగలిరేకులు’, ‘లయ’, ‘డాక్టర్‌ చక్రవర్తి’, ‘శుభాకాంక్షలు’, ‘ఆరాధన’, ‘ముద్దుబిడ్డ’ సీరియల్స్‌ లో నటించింది. ‘ అంతే కాదు సినిమాలో కూడా నటిస్తుంది ఈ అమ్మడు. ఇటు బుల్లి తెర పైన అటు వెండి తెర పైన బిజీ గ ఉంటుంది లహరి.

చక్రవాకం సీరియల్ లో నటించిన ఈ నటులు అందరూ జీవితంలో ఎలా స్టిర పడ్డారో చూసారు కదా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here