జీ సినీ తెలుగు అవార్డులు వేడుక శనివారం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. 2019 ఏడాదికి గాను ఈ అవార్డుల ప్రధానం జరిగింది. ఉత్తమ నటుడిగా మెగాస్టార్ చిరంజీవి (సైరా నరసింహారెడ్డి ), ఉత్తమ నటిగా సమంత (మజిలి, ఓ బేబీ) దక్కించుకున్నారు. ట్విట్టర్ స్టార్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు అందుకున్నారు. ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రం చాలా కేటగిరీలలో అవార్డులను అందుకుంది. కళాతపస్వి కె. విశ్వనాధ్ ను జీవిత సాఫల్య పురస్కారం తో సత్కరించారు. ఈ వేడుకకు సినిమా ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, దర్శకులు కె. విశ్వనాథ్, నటి సమంత అక్కినేని, ఇస్మార్ట్ శంకర్ ఫెమ్ నిధిఅగర్వాల్, హీరోయిన్ పూజా హెగ్డే, హీరో రామ్, హీరో కార్తికేయ, ఇస్మార్ట్ దర్శకుడు పూరీజగన్నాధ్, ఛార్మి, భూమిక, నందిని రెడ్డి, ఖుష్భు, జయప్రద, రెజీనా, నవీన్ పోలిశెట్టి, అనసూయ తదితరులు హాజరయ్యారు.

జీ సినీ అవార్డుల విజేతలు వీరే :-

ఉత్తమ నటుడు – మెగాస్టార్ చిరంజీవి (సైరా నరసింహారెడ్డి)
ఉత్తమ నటి – సమంత అక్కినేని (మజిలీ, ఓ బేబీ)
బెస్ట్ ఫైండ్ అఫ్ ది ఇయర్ – శ్రద్దా శ్రీనాధ్ (జెర్సీ)
ఉత్తమ సహాయ నటుడు – అల్లరి నరేష్ (మహర్షి)
ఉత్తమ హాస్యనటుడు – రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి (బ్రోచేదెవరురా)
ఫెవరెట్ యాక్టర్ అఫ్ ది ఇయర్ – నాని (జెర్సీ)
ఫెవెరెట్ నటి – పూజ హెగ్డే (మహర్షి)
ఉత్తమ నిర్మాత – ఛార్మి (ఇస్మార్ట్ శంకర్)
సెన్సేషనల్ స్టార్ అఫ్ ది ఇయర్ – రామ్ (ఇస్మార్ట్ శంకర్)
బెస్ట్ సెన్సేషన్ డైరెక్టర్ – పూరి జగన్నాధ్ (ఇస్మార్ట్ శంకర్)
ఉత్తమ సంగీత దర్శకుడు – మణిశర్మ (ఇస్మార్ట్ శంకర్)
ఉత్తమ గాయకుడు – సిద్ శ్రీరామ్ (కడలల్లే.. డియర్ కామ్రేడ్)
ఫెవరేట్ ఆల్బమ్ అఫ్ ది ఇయర్ – జస్టిస్ ప్రభాకరన్ (డియర్ కామ్రేడ్)
ఉత్తమ విలన్ – తిరువీ (జార్జిరెడ్డి)
ఉత్తమ స్క్రీన్ ప్లే – వివేక్ ఆత్రేయ (బ్రోచేవారెవరురా)
ఉత్తమ నూతన నటి – శివాత్మిక రాజశేఖర్ (దొరసాని)
ఉత్తమ నూతన నటుడు – ఆనంద్ దేవరకొండ (దొరసాని)
ఉత్తమ సినిమాటోగ్రఫర్ – రత్నవేలు (సైరా నరసింహారెడ్డి)
న్యూ సెన్సేషన్ అఫ్ ది ఇయర్ – తరుణ్ భాస్కర్ (మీకు మాత్రమే చెప్తా)
ఉత్తమ గాయని – చిన్మయి (ప్రియతమా..మజిలీ)
ఫెవరేట్ డెబ్యూ డైరెక్టర్ – స్వరూప్ ఆర్ ఎస్ జె (ఏజెంట్ సారి శ్రీనివాస ఆత్రేయ)
ఫెవరెట్ సపోర్టింగ్ యాక్టర్ – నీల్ నితీశ్ ముఖేష్ (సాహో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here