నాగార్జున స్థాయి ఎక్కడ? నరేంద్ర మోఢీ స్థాయి ఎక్కడ? ఆయన నాగార్జున కు షాక్ ఇవ్వడం ఏంటి అనే కదా మీరు అనుకుంటున్నారా… అవును నిజమే మోఢీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అది మన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా చెప్పుకోవాల్సిన విషయం.. ఎందుకంటే మూడు తరాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీని కనుసైగతో శాసిస్తున్న అక్కినేని కుటుంబానికి ప్రతికూలంగా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుందంటే అది ఖచ్చితంగా చర్చనీయాంశమే… ‘అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్’కు చెందిన ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ ను రద్దు చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అయితే ఆ ఒక్కరిమీదనే కక్షకట్టి ప్రభుత్వం ఏదో చేసిందని అని మాత్రం అనుకోకండి…

ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే నాగార్జున కుటుంబ ప్రభావం ఉంటుంది. ఆ నాగార్జున బీజేపీకి వ్యతిరేకంగా చేసింది లేదు. ఒకవేళ అనుకూలంగా ఆపార్టీ మార్చుకుందామన్నా ప్రత్యేకంగా వారికి ఒరిగేదీ లేదు. ఇదంతా ఎందుకంటే తమకు అనుకూలంగా లేని వ్యక్తులు, వ్యవస్థలు, పార్టీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సీబీఐ, ఈడీ, ఐటీ… ఇలా ఆయా సంస్థలను ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందేగా… అయితే ఇది మాత్రం ఆ కోవలోకి రాదు. ఎందుకంటే…

దేశ వ్యాప్తంగా ఆదాయపు వివరాలు ఇవ్వని పలు ఎన్జీవోల గుర్తింపును రద్దు చేసినట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో ప్రకటించారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు ఎన్జీవోలు ఉన్నాయి. తెలంగాణకు చెందిన 190, ఏపీకి చెందిన 450 సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ లిస్టులో అక్కినేని ఫౌండేషన్ కూడా ఉంది. విదేశాల నుంచి విరాళాలు అందుకుంటున్న ఎన్జీవోలు వారి వార్షిక ఆదాయ వివరాలను కేంద్రాంకి ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, వివరాలను సమర్పించని సంస్థలపై తాజాగా కేంద్రం వేటు వేసింది. ఎఫ్సీఆర్ఏ లేని ఎన్జీవోలు విదేశాల నుంచి విరాళాలను పొందలేవు.

అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ను 2005లో అక్కినేని నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ద్వారా పలువురు విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇస్తున్నారు. మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేస్తున్నారు. వీటితో పాటు పలు సేవా కార్యక్రమాలు, కుటుంబ వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here