నీ కాళ్ళు పట్టుకుంటా కనికరించు అని బ్రతిమిలాడుతున్న కానిస్టేబుల్..మొగుళ్ళంటే కొట్టేవాళ్ళే తిట్టేవాళ్ళే కాదు పెళ్ళాం అలిగి పుట్టింటికి వెళుతుంటే ఏడ్చే భర్తలు కూడా వుంటారు. చీటికి మాటికి అలిగే భార్య, పెట్టాబేడా సర్దుకుని పుట్టింటికి పోతుంటే రైల్వేస్టేషన్ వద్ద కాపు కాసిన ఓ కానిస్టేబుల్, తనను వదిలి వెళ్ళద్దంటూ కన్నీళ్ళ పర్యంతమై భార్యను ఎలా వేడుకుంటున్నాడో చూడండి. ఇంతకీ ఈమె అలిగి పోవడానికి కారణం ఏమిటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. సెకండ్ షో సినిమాకు తీసుకెళతానని చెప్పిన భర్త, డ్యూటీ ముగించుకుని ఇంటికి లేటుగా రావడమే కారణం. ఈ చిన్న విషయానికి అలిగిన భార్య పుట్టింటికి పరుగుతీసింది. భార్య అలిగి వెళుతుంటే తోటి కానిస్టేబుళ్ళను వెంటపెట్టుకుని మరీ… ఆ కానిస్టేబుల్ భర్త రైల్వేస్టేషన్ వద్దకు చేరుకుని భార్య కాళ్ళావేళ్ళా పడ్డాడు. మొగుళ్ళలో ఇలాంటి మంచి మొగుళ్ళు కూడా వుంటారని గమనించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here