ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ తో అద్భుత విజయం సాధించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ కలయికలో కొత్త సినిమా ఈరోజు ఉదయం ముంబయిలో ప్రారంభమైంది. ఈ చిత్రం కోసం కరన్ జోహార్ తో పూరి జగన్నాధ్ చేతులు కలిపారు. విజయ్ దేవరకొండ హీరోగా ప్రారంభమైన ఈ చిత్రానికి పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరన్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాణ భాద్యతలు వహించనున్నారు.

ధర్మ ప్రొడక్షన్ ప్రెజెంట్స్, పూరి కన్నెక్ట్స్, పూరి జగన్నాద్ టూరింగ్ టాకీస్ పతాకంపై తెలుగు, హిందీ, మరియు ఇతర దక్షిణ భారత భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం కోసం విజయ్ బాగానే కసరత్తు చేస్తున్నాడు, ఇటీవలే ఈ రౌడీ థాయిలాండ్ లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడట. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలుగా రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ పోషిస్తున్నారట. హీరోయిన్ కూడా ఇంకా ఫైనల్ కాలేదని, ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదని, త్వరలో మరిన్ని విషయాలతో ముందుకు వస్తారట. అయితే విజయను పూరి ఎలా చూపిస్తాడా అని రౌడీ ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూసున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here