బైక్‌పై వెళ్తోన్న అన్నాచెల్లిలిని అడ్డ‌గించిన అయిదుమంది దుండ‌గులు దాడి చేసి వారిని ఓ గ‌దిలో బంధించారు. ఇద్ద‌ర్నీ న‌గ్నంగా మార్చి,దారుణంగా వీడియోలు తీశారు.ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని స‌వాయ్ మాధోపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని గంగాపూర్‌కు చెందిన బాధితుల పేర్లు రాజేశ్ తివారి, శ్వేత తివారీ.

రాజ‌స్థాన్‌లో స‌వాయ్ మాధోపూర్ జిల్లాలో మోరల్ పోలీసింగ్ పేరిట దాడి చేశారు.. మొత్తాన్ని రికార్డు చేసిన ఓ వ్యక్తి దానిని సోషల్ మీడియాలో పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై వివరణ ఇచ్చిన పోలీస్ ఇన్ స్పెక్టర్ మోహన్ వాగ్మారే యువజంటదే తప్పంటూ వాదించారు. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర భంగిమల్లో కూర్చుంటున్న సదరు జంటపై స్థానికులు దాడి చేశారు.

దాడి చేసిన అయిదుమందినీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. రాజేశ్ తివారీపై ఉన్న పాత క‌క్ష‌తోనే వారు ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్టు పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది.బాధితులిద్ద‌రినీ పోలీసులు ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌రలించారు. గంగాపూర్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై పోలీస్ ఇన్‌స్పెక్టర్ వివరణ ఇచ్చారు. ఆ యువజంటను అక్కడ నుంచి పంపించివేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here