బ్రేకింగ్ న్యూస్..ఆశ్లీల చిత్రాలు చూస్తున్నాడని కొడుకు చేయి నరికేసిన తండ్రి..

0
244

అశ్లీలం..ఇప్పుడు మొబైల్ లో చాలా ఈజీగా దొరికేస్తోంది. మొబైల్ లో నెట్ ఉంటే చాలు ప్రపంచంలో ఏ మూల ఉన్నా.. మన మొబైల్ లో ప్రత్యక్షం అయిపోతుంది. చిన్న పిల్లలకు సైతం మొబైల్ కంపల్సరీ అయిపోయిన ఈ రోజుల్లో అదేస్థాయిలో అశ్లీలం కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో నేటి యువత పెడదోవ పడుతోంది. నేటి పేరంట్స్ కి ఇది సమస్యగా మారింది. సరిగ్గా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో పాతబస్తీ పహాడీఫరీఫ్ లో జరిగింది. కుమారుడు పదేపదే మొబైల్ లో చూస్తుండటంతో మందలించాడు తండ్రి. అయినా ఎన్నిసార్లు మందలించినా వినకపోవటంతో కోపంతో చేయి నరికేశాడు. ఈ షాకింగ్ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ పాతబస్తీ పహాడీఫరీష్ జల్ పల్లి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖయ్యుం వృత్తిరీత్యా ఎలక్ట్రిషియన్. పెద్ద కుమారుడు ఖాలెద్ ఖురేషీ (18) లోకల్ కేబుల్ ఆఫీస్ లో పని చేస్తుంటాడు. కొంత కాలంగా ఖురేషీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. సరిగా పనికి కూడా వెళ్లటం లేదు. ఎప్పుడూ మొబైల్ చూస్తూ ఉన్నాడు. ఇది గమనించిన తండ్రి.. ఏం జరుగుతుందో అని దృష్టి పెట్టాడు. అశ్లీల దృశ్యాలు చూస్తున్నాడని గుర్తించి మందలించాడు. అయినా ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో కుమారుడి మొబైల్ ని కనిపించకుండా దాచేశాడు. దీంతో తండ్రి – కొడుకు మధ్య గొడవ జరిగింది. ఓ సారి తండ్రిపైనే దాడి చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ సర్ధిచెప్పి ఇంటికి తీసుకొచ్చాడు తండ్రి. అయినా వినకుండా మార్చి 5వ తేదీ సోమవారం ఇంట్లో ఖురేషీ అదే పనిగా మళ్లీ మొబైల్ చూస్తూ తండ్రి కంట పడ్డాడు.

కొడుకు ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. తండ్రి ఖయ్యూం.. మాంసం కొట్టే కత్తితో కుమారుడి చేయి నరికాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఖురేషీని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కుమారుడి చేయి నరికింది నేనే అంటూ తండ్రి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు తండ్రి ఖయ్యూం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here