భర్తను చంపి.. ప్రియుడిపై యాసిడ్ పోసి.. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. ఓ క్రైం హర్రర్, వర్మ, రవిబాబులను మించిన సస్పెన్స్ థ్రిల్లర్!

0
592

ఇదో పెద్ద క్రైమ్ థ్రిల్లర్. భర్తను దారుణంగా హత్య చేసి, అతని స్థానంలో ప్రియుణ్ణి తెచ్చుకుని, నలుగురి ముందూ భర్తగా నిలపాలని ఓ భార్య పన్నిన పన్నాగం. అచ్చుగుద్దినట్లు ‘ఎవడు’ సినిమాలో మాదిరి ప్లాస్టిక్ సర్జరీలు చేయించి మొగుడి ప్లేసులో తన కొత్త మొగుణ్ణి దింపాలనుకుంది. ఈ అభినవ సతీ సావిత్రి చేసిన పనిని చూసి యావత్ దేశం ముక్కన వేలేసుకుంటోంది. భర్తపై యాసిడ్ దాడి జరిగిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులను నమ్మించిన కిలాడీ.. న్యాయమూర్తి ముందు తలకు బ్యాండేజీ వేసివున్న ప్రియుడితో స్టేట్ మెంట్ ఇప్పించేంతటి కథ నడిపిన శాడిస్ట్.. అయితే స్వాతి కథ, స్క్రీన్ ప్లే క్లయిమాక్స్ లో బయటపడింది. ఇంకేముంది, ఆమె, ప్రియుడు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి దాపురించింది.. గత వారం నాగర్ కర్నూలులో సంచలనం కలిగించిన యాసిడ్ దాడి వెనుకున్న అసలు నిజాలు తెలుసుకుని ఇప్పుడు పోలీసులే నివ్వెరపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here