రక్తదానం చేస్తే షిర్డీలో VIP దర్శనం

0
420

రక్తదానం చేస్తే షిర్డీలో VIP దర్శనం

రక్తదానం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.షిర్డీ సాయినాధుని దర్శనానికి వెళ్లిన వారు రక్తదానం చేయడం ద్వారా ఒక ఏడాదిపాటు ఆలయంలో వీఐపీ హోదాలో దర్శనం తోపాటు సత్రాల్లో బస విషయంలో కూడా వీఐపీ తరహాలోనే ఏర్పాటు చేస్తారని చెప్పారు షిర్డీ ట్రస్టు చైర్మన్.

సర్వ మానవ శ్రేయస్సు కోసం ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్టు చైర్మన్‌ సురేశ్‌ హారే మీడియాకు తెలిపారు. తిరుమల తిరుపతిలో తలనీలాలు సమర్పించినట్లే.. షిర్డీకి వచ్చినవారు రక్తదానం చేయడం ఆనవాయితీగా మారుస్తామన్నారు ఆయన. భక్తులు ఈ చర్యతో మానవతా దృక్పథాన్ని చాటుకోవడంతోపాటు ఒక మంచి పనిచేశామని సంతృప్తి కూడా దక్కనుందన్నారు సురేశ్ హారే. షిర్డీని బ్లడ్‌ బ్యాంక్‌ హబ్‌గా మార్చడం తమ ఉద్దేశమని చెప్పారు ఆయన.

పవిత్రమైన షిర్డీ ఆలయంలో సాయిబాబా దర్శనం కోసం క్యూలో నిల్చొని విసిగి పోవాల్సిన అవసరం లేకుండా రక్తదానం చేయండం ద్వారా మీకు కూడా వీఐపీ దర్శనం లభిస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు ఎప్పుడు షిర్డీ వెళ్ళినా రక్త దానం చేయండి సాయినాధుని వీఐపీ దర్శనం చేసుకోండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here