దేశంలో మహిళలకు ఎక్కడ భద్రత లేకుండా పోయింది. ఎన్ని చట్టాలు తెచ్చినా నిర్భయ ఘటనలు మాత్రం రోజూ వెలుగు చూస్తూనే వున్నాయి. ఇటీవల ముంబై లోకల్ రైల్వే స్టేషన్లో ఓ యువతిని ఓ 60 ఏళ్ళ వ్యక్తి పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్న ఘటన సంచలనం రేపింది. తాజాగా నడుస్తున్న ట్రైన్లోనే ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. ముంబైలో దాదర్-కుర్లా లోకల్ ట్రెయిన్లో గురువారం రాత్రి ఈ ఘటణ చోటు చేసుకుంది.

దివ్యాంగులకు కేటాయించిన కంపార్ట్మెంట్లోకి ప్రవేశించిన ఓ దుండగుడు ఓ ప్రయాణికురాలిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఆ బోగీలో వున్న వారంతా దివ్యాంగులు కావడంతో, అతన్ని ఎదుర్కొనే సాహసం చేయలేకపోయారు. దీంతో మరింత రెచ్చిపోయిన దుండగుడు ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. పక్కనే లేడీస్ కంపార్ట్ మెంట్లో వున్న రైల్వే సెక్యూరిటీ పోలీస్ చోద్యం చూస్తున్నాడే తప్ప, ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు.

చివరికి సదరు యువతి ఆ దుండగుడికి ఎదురు తిరగడం, తోటి ప్రయాణీకులు ఆమెకు అండగా నిలవడంతో, స్టేషన్ రాగానే ఈ కీచకుడిని రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ కీచకపర్వాన్ని బోగీలో వున్న పాక్షిక అంధుడైన తోటి ప్రయాణికుడు వీడియో తీయడంతో వైరల్ గా మారింది.

నిందితుడిని రఫిక్ షేక్‌గా గుర్తించారు. అతనిపై హత్యాయత్నం, లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేశారు. అతడు సదరు మహిళకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాల్సి ఉండగా.. ఆ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడ్ని శుక్రవారం రైల్వే కోర్టు ముందు హాజరుపర్చుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమెను లైంగిక వేధించిన నిందితుడు.. ఆమెను చంపేందుకు కూడా ప్రయత్నించాడని పోలీసులు చెప్పారు. బాధిత మహిళను నిందితు తీవ్రంగా కొట్టాడని, అడ్డుకునేందుకు యత్నిస్తే తనను కూడా చంపుతాడేమోనని ముందుకెళ్లలేదని ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. అయితే, తాను గార్డును ఎమర్జెన్సీ అలారం ఇవ్వమని అడిగానని, కానీ, అతడు పట్టించుకోలేదని చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here