వస్తువులను కొనాలనుకుంటే ఈ రెండు రోజులు బెస్ట్ టైం.. ఇంత కంటే మంచి ఆఫర్స్ భవిష్యత్ లో రాకపోవచ్చు

0
363

వస్తువులను కొనాలనుకుంటే ఈ రెండు రోజులు బెస్ట్ టైం.. ఇంత కంటే మంచి ఆఫర్స్ భవిష్యత్ లో రాకపోవచ్చు

ఇవాళ, రేపు మాత్రమే ఈ సేల్స్ ఉండనున్నాయి. జూలై ఒకటో తేదీ నుంచి కొత్త పన్ను విధానంలోకి మారుతుండటంతో.. వీటిపై మూడు శాతం అదనంగా ట్యాక్స్ ఉంటుంది. జూన్ 29, 30 తేదీల్లో పాత స్టాక్ ను మరింతగా బయటకు పంపించేందుకు డిస్కౌంట్ పెంచినా ఆశ్చర్యం లేదు. మీరు ఈ వస్తువులను కొనాలనుకుంటే ఈ రెండు రోజులు బెస్ట్ టైం అని.. ఇంత కంటే మంచి ఆఫర్స్ భవిష్యత్ లో రాకపోవచ్చు అంటున్నారు వ్యాపారులు. టీవీలపై గరిష్టంగా 25శాతం ఆఫర్ వస్తుంది. బైక్స్ పై 4,500 రూపాయలు తగ్గింపు ఉంది. ఫ్రిడ్జ్ లపై 20శాతం వరకు, వాషింగ్ మెషీన్స్ పై 15 నుంచి 20శాతం తగ్గింపు ఉంది. బ్రాండెడ్ దుస్తులు వెయ్యి రూపాయల కంటే అదనంగా కొనుగోలు చేయాలన్నా ఇదే రైట్ టైం అంటున్నారు. GSTలో ఇది 18శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో హైదరాబాద్ సిటీలోని అన్ని మాల్స్ లో బ్రాండెడ్ దుస్తులపై 50శాతం ఫ్లాట్ ఆఫర్స్ కూడా ఇచ్చారు. ఈ ఆఫర్స్ మొత్తం ఎల్లుండి అంటే జూన్ 30వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు మాత్రమే..

ఎల్లుండి నుంచి (జూలై 1) నుంచి దేశమే మారబోతోంది. మీ జీవితం కొత్తగా ఉండబోతుంది. GST (గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్) అమల్లోకి రాబోతుంది. ఒకే జాతి – ఒకే పన్ను – ఒకే మార్కెట్ విధానంలో వస్తు ధరలు అన్నీ మారబోతున్నాయి. ప్రతి వస్తువు ధరలో వ్యత్యాసం రాబోతుంది. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్స్ ప్రకటించాయి కంపెనీలు. ప్రస్తుతం 15శాతంగా ఉన్న ట్యాక్స్ 18శాతం పరిధిలోకి వచ్చింది. అంటే జూలై ఒకటవ తేదీ నుంచి మీరు టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్స్, మొబైల్స్, ల్యాప్ ట్యాప్స్ లు, బైక్స్, షూస్ పై భారీ ఆఫర్స్ ఇచ్చారు. Paytm, ఫ్లిప్ కార్డ్, అమెజాన్, ఇతర పోర్టల్స్ ద్వారా కంపెనీలు భారీ డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. కనీసంగా ఒక్కో వస్తువుపై 10 నుంచి 40శాతం వరకు తగ్గింపు ఇస్తున్నాయి.

GST.. జూలై ఒకటి తర్వాత ఎలా ఉంటుంది.. ఎలా ఉండబోతుంది.. ఎంతెంత రేట్లు పెరగనున్నాయి అనేది తెలుసుకోవాలంటే మరి కొన్ని ఆగాలి. ఈలోపు డిస్కౌంట్స్ లో ఎక్కడెక్కడ ఎంతంతె తక్కువ ధరకు వస్తువులు దొరుకుతున్నాయో చూసేద్దాం.. కొనాలంటే కొనేసుకుందాం. చౌక బేరం మళ్లీ రాదు కదా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here