సమయం లేదు మిత్రులారా.. ఏ పండగ సీజన్ లోనూ ఇంత కంటే తక్కువ ధరకు దొరకవు ఈ వస్తువులు.. కొనాలంటే ఇప్పుడే కొనేయండి..

0
406
సమయం లేదు మిత్రులారా.. ఏ పండగ సీజన్ లోనూ ఇంత కంటే తక్కువ ధరకు దొరకవు ఈ వస్తువులు.. కొనాలంటే ఇప్పుడే కొనేయండి..

వారం అంటే సరిగ్గా వారం రోజులు మాత్రమే… ఆ తర్వాత ఈ క్రింద పేర్కొన్న వస్తువులు మరింత కాస్ట్లీ కాబోతున్నాయి. ఈ నెల లేదా రెండు నెలల్లో కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరిగ్గా రైట్ టైం అంటున్నారు మన వ్యాపారులు. జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రాబోతున్న GST వల్లతో ఈ వస్తువుల ధరలు పెరగనున్నాయని.. కొనాలనుకుంటే ఈ వారం రోజులే మంచి ఆఫర్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఏ పండగ సీజన్ లోనూ ఇంత కంటే తక్కువ ధరకు దొరకవని కూడా చెబుతున్నారు.

ఈ వారంలో ఏయే వస్తువుల కొనుగోలు చేయొచ్చో చూద్దాం.
బంగారం, ఆభరణాలు :
వచ్చే నెల, రెండు నెలల్లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ వారం సరైన సమయం అంటున్నారు. బంగారం బిస్కెట్లపైనే కాకుండా తయారీ ఆభవరణాలపైనా GST పరిధిలోకి వచ్చిన తర్వాత పన్ను భారం పడనుంది. అంతేకాకుండా బంగారంపై పెట్టుబడికి కూడా ఇది సరైన సమయం అంటున్నారు వ్యాపార నిపుణులు

మొబైల్ ఫోన్లు :
స్మార్ట్ ఫోన్లు 4శాతం ధర పెరగనున్నాయి. ఇప్పుడు 12శాతంగా ఉన్న ట్యాక్స్.. జూలై ఒకటి నుంచి 18శాతంగా ఉండనుంది. 10వేల రూపాయల విలువైన మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే 1800 ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.

చిన్నకార్లు, బైక్స్ :
చిన్నకార్లు, బైక్స్ GST పరిధిలోకి రాగానే ఇప్పుడున్న ధర కంటే 8-10శాతం వరకు పెరగనున్నాయి. దీంతో ఈ వారమే చిన్నకార్లు, బైక్స్ కొనుగోలు మంచి టైం అంటున్నారు. దీనికితోడు ప్రస్తుతం 10శాతం డిస్కౌంట్ గా వస్తుంది. మొత్తంగా చూసుకుంటే జూన్ 30వ తేదీలోపు కొనుగోలు చేసే వాహనాలు 15శాతం వరకు తక్కువ ధరకి లభించే అవకాశం ఉంది.
ల్యాప్ ట్యాప్, డెస్క్ టాప్స్ :
ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ కు ప్రస్తుతం 15శాత ట్యాక్స్ ఉంది. GST లో 18శాతం వరకు ఉంటుంది. జూలై ఒకటి తర్వాత బ్రాండెడ్ ల్యాప్ ట్యాప్ లు, కంప్యూటర్స్ కనీసంగా 5శాతం పెరగనున్నాయి. 20వేలకు వెయ్యి రూపాయలు అదనంగా ఖర్చవుతుంది. సో.. ఈ వారం రోజుల్లో కొనుగోలు చేస్తే డిస్కౌంట్స్, ఇతర ఆఫర్స్ కింద 10శాతం తక్కువకే లభించనున్నాయి.
టీవీలు – ఫ్రిడ్జిలు :
వివిధ రాష్ట్రాల్లో వీటిపై ప్రస్తుతం ట్యాక్స్ 23 నుంచి 28శాతంగా ఉంది. GSTలో 28 శ్లాబ్ లో నిర్ణయించారు. జూలై ఒకటి తర్వాత టీవీలు, ఫ్రిడ్జిలపై 2-3శాతం ధరలు పెరగనున్నాయి.

ఈ వస్తువులు కొనుక్కోవాలి అని మీకు ఆలోచన ఉంటే మాత్రం ఈ వారం రోజులు కరెక్ట్ టైం అంటున్నారు వ్యాపారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here