Connect with us

Featured

కాటన్ బడ్స్ వాడటం వల్ల ఎలాంటి ప్రమాదముందో తెలుసా..? మరి చెవులు ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి!

Published

on

చెవులలో గులిమి తీయడానికి కాటన్ బడ్స్ నువాడుతున్నారా… కాటన్ బడ్స్‌ను వాడడం వలన చెవికి హానికరమట …కాటన్ ఇయర్ బడ్స్ వాడడం వలన ఇంగ్లాండ్ లో ప్రతి ఏడాది 7వేల మందికి చెవి సంబందిత అనారోగ్యాలు కలుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి…..మన శరీరంలో ఉన్న అత్యంత సున్నితమైన భాగాల్లో చెవి అంతర్గత భాగం కూడా ఒకటి. దాంట్లో ఎన్నో రకాల నరాలు అత్యంత సున్నితంగా ఉంటాయి. వాటికి ఏదైనా తాకితే ఇక అంతే సంగతులు, చెవి వినబడకుండా పోవడమో, ఇన్‌ఫెక్షన్లు రావడమో, ఇంకా వేరే చెవి సంబంధ అనారోగ్య సమస్యలు రావడమో జరుగుతుంటుంది..

* కాటన్ బడ్స్ ను ఉపయోగించడం వల్ల చెవిలోని అంతర్గత భాగాలు డ్యామేజ్ అవుతాయని డాక్టర్లు చెబుతున్నారు.

Advertisement

* చెవిలో ఉండే గులిమిని తీయడం కోసం ఒకవేళ కాటన్ బడ్ పెడితే ఆ గులిమిని మరింత లోపలికి నెట్టి, ఇయర్ కెనాల్‌కు అడ్డంకి ఏర్పడుతుంది. దీంతో వినికిడి సమస్యలు వస్తాయి.

* చెవుల్లో గులిమి ఏర్పడడం సహజసిద్ధమైన ప్రక్రియ. చెవిలో అంతర్గతంగా ఉండే కొన్ని గ్రంథులు గులిమిని స్రవిస్తాయి. ఇది సాధారణ స్థాయిలో ఉంటే మనకు దాంతో కలిగే అనారోగ్యం ఏమీ ఉండదు.

* గులిమిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థకు సహకరిస్తాయి. దీంతోపాటు చెవులను శుభ్రంగా ఉంచడం కోసం కూడా గులిమి తయారవుతుంది.

Advertisement

* చెవిలో తయారయ్యే గులిమి సహజంగా కొన్ని రోజులకు దానంతట అదే పోతుంది. అంతేకానీ దాన్ని తీయడం కోసం కాటన్ బడ్స్‌ను వాడకూడదని చెబుతున్నారు వైద్యులు.

కాటన్ బడ్స్ తో కాకుండా గులిమిని క్లీన్ చేసుకోవడం ఎలా ????

కొంత మందిలో గులిమి ఎక్కువగా తయారవుతుంది. అలాంటి వారు గులిమిని క్లీన్ చేసుకోవాలంటే 1 టీస్పూన్ ఉప్పును తీసుకుని 1/2 కప్ గోరు వెచ్చని నీటిలో కలపాలి. చెవుల్లో పెట్టుకునే దూదిని కొద్దిగా తీసుకుని ఆ మిశ్రమంలో నానబెట్టాలి. అనంతరం ఆ దూదిని తీసి సమస్య ఉన్న చెవిని పై వైపుకు వచ్చేలా తలను ఓ వైపుకు వంచి ఆ చెవిలో దూదిని పిండాలి. అందులో నుంచి కొంత ద్రవం చుక్కలు చుక్కలుగా చెవిలో పడుతుంది. తరువాత చెవిని 3 నుంచి 5 నిమిషాల పాటు అలాగే వంచి ఉంచాలి. సమయం గడిచాక తలను మరో వైపుకు వంచితే ఆ ద్రవం చుక్కలు ఇంకో చెవి గుండా బయటకు వస్తాయి. అనంతరం చెవులను నీటితో శుభ్ర పరుచుకోవాలి. ఇలా చేస్తే అధికంగా ఉన్న గులిమి పోతుంది. అయితే పైన చెప్పిన విధంగా ఉప్పు ద్రవమే కాకుండా దాని స్థానంలో బేబీ ఆయిల్‌, మినరల్ ఆయిల్ వంటివి వాడుకోవచ్చు. కానీ వాటి వలన మీకు ఎలాంటి అలర్జీలు లేకపోతేనే వాటిని ట్రై చేయాలి.. లేదంటే సాల్ట వాటరే బెటర్‌.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Pitapuram: అందరి ఆసక్తి పిఠాపురం పైనే.. గెలుపు ఎవరిది.. సర్వేలు ఏం చెబుతున్నాయి?

Published

on

Pitapuram: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఎన్నికల హడావిడి మొదలైనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అందరి చూపు పిఠాపురం నియోజకవర్గం పైనే ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరి జెండా ఎగురుతుందన్న విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇలా పిఠాపురం పైన ఇంత ఆసక్తి రావడానికి కారణం అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే కారణమని చెప్పాలి.

గత ఎన్నికలలో భీమవరం గాజువాకలో పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం కాపులు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు ఈ క్రమంలోనే ఈయనకు పోటీగా వైసిపి పార్టీ నుంచి వంగా గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ ఎవరు గెలుస్తారో అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటికే ఎన్నో చానల్స్ వారు ప్రజా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. వంగా గీత కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ అంతేకాకుండా ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కూడా ఈమె కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో వంగా గీత కాకుండా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.

Advertisement

జనసేనదే విజయమా..
ఇకపోతే వంగా గీత 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగి పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు అయితే అప్పట్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిన పిఠాపురానికి చేయాల్సినటువంటి న్యాయం చేయలేకపోయారని అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతున్నామంటూ చాలామంది ప్రజలు పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేస్తున్నారంటూ పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి చూడాలి మరి పిఠాపురంలో ఏ జెండా ఎగురుతుంది వంగా గీత పవన్ కళ్యాణ్ కి ఎలా పోటీగా నిలబడతారు అనేది తెలియాల్సి ఉంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!