Connect with us

Featured

చెమటతో బట్టలు తడిసిపోయేవి.. ఉదయభాను రియల్ లైఫ్ స్టొరీ తెలిస్తే హ్యాట్సఫ్ అంటారు

Published

on

డ్యాన్స్ బేబి డ్యాన్స్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఉదయభాను. బుల్లి తెరపై, వెండి తెరపై ఈమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. దాదాపు 15 సంవత్సరాలు ఈమె బుల్లి తెరను ఏలింది అంటే అతిశయోక్తి కాదు. ఏ ప్రోగ్రాం చేసినా, ఏ స్టేజ్‌ షో చేసినా ఆ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చేది.

బుల్లితెర మహారాణి.. మాటల మాంత్రికురాలు.. ఇలా ఒకటేంటి ఉదయభాను గురించి ఎన్ని చెప్పినా తక్కువే..అంటారు అభిమానులు….ఆమె దాదాపు సంవత్సరంన్నర కాలంగా బుల్లితెరకు దూరంగా ఉంటోంది.

Advertisement

బుల్లితెర శ్రీదేవిగా పేరు తెచ్చుకున్న ఆమె అంతకంటే అందమైన మనసు కూడా ఉందని ఎన్నో సందర్భాల్లో రుజువుచేసుకున్నారు. అతి చిన్న వయసులో కెరీర్‌ ప్రారంభించి ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొని స్వశక్తితో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

ఏడాది కిందట కవల పిల్లలకు జన్మనిచ్చి మూడేండ్ల విరామం తర్వాత ‘నీతోనే డ్యాన్స్‌’ షోతో మళ్ళీ తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆమెతో మానవి చిట్‌చాట్‌…
సుమారు మూడేండ్ల తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చారు.


ఈ సమాజంలో మహిళలుగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం. నరరూప రాక్షసుల మధ్య బతుకుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలకు రక్షణ చాలా అవసరం. స్త్రీ శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు. స్త్రీ తలచుకుంటే ఏమైనా చేయగలదు. ప్రతి ఆడపిల్ల ఓ శక్తిగా మారి ఈ దుష్ట సమాజంపై తిరుగుబాటు చేయాలి.

ధైర్యంగా సమస్యలను ఎదుర్కొవాలి. ఒక్కోసారి మనల్ని రక్షించాల్సిన చేతులే మన పీక పిసికే పరిస్థితి వస్తున్నది. అలాంటి వాటిని కూడా ఎదుర్కొనే ధైర్యం అమ్మాయిలకు ఉండాలి. అని అంటుంది ఉదయభాను…

Advertisement

ఉదయభాను పుట్టింది కరీంనగర్‌ దగ్గర కొహెడ. అమ్మ అరుణ, ఆయుర్వేద డాక్టర్‌. నాన్న ఎస్‌.కె పటేల్‌. నాన్న కూడా డాక్టరే. అయితే నాలుగేండ్ల వయసులోనే నాన్న చనిపోయారు. ఆయన చాలా దాన ధర్మాలు చేసేవారు. వందల ఎకరాలు దానం చేసిన గొప్ప దాత. కష్టపడేతత్వం వారి నుంచే తనకు వచ్చిందని, వారిచ్చిన ధైర్యంతోనే చిన్నతనం నుంచే మోయలేనన్ని భారాలు తనమీద ఉన్నా ముందుకు నడవగలిగానని అంటుంది ఉదయభాను.

అమ్మ డ్యాన్స్‌ నేర్పించింది. స్టేజ్‌ షోలు చేసేదాన్ని. అక్కడ నన్ను చూసి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. మొదట చేసింది ఎర్రసైన్యం సినిమాలో. అప్పుడు ఎత్తు పెరిగాను గానీ చాలా చిన్నదాన్ని. డైలాగులు చెప్పడానికి వణికిపోయేదాన్ని. చెమటతో బట్టలు తడిసిపోయేవి.

అలాంటిది ‘హృదయాంజలి’ షో వందల మందిలో మైక్‌ పట్టుకున్నాను. అప్పుడు ఆ ధైర్యం ఎలా వచ్చిందో నాకే తెలియదు. బహుశా జీన్స్‌ నుంచి వచ్చిన ధైర్యమేమో. ‘నిగ్గిదీసి అడుగు’ వంటి ఛాలెంజింగ్‌ షోస్‌ కూడా అదే ధైర్యంతో చేయగలిగాను. అంటూ చెప్పుకోచింది ఉదయభాను..

Advertisement

నా పిల్లల్ని ఆడపులుల్లా పెంచుతాను. ఈ సమాజంలో అమ్మాయిలు అలా ఉంటేనే బతకగలరు. మమ్మల్ని కాపాడండీ అంటూ ఆర్తనాదాలు చేయకూడదు. దాడి చేసే వారిపై తిరగబడాలి. అందుకే ఆడపిల్లలకు కేవలం డ్యాన్స్‌, సంగీతం నేర్పిస్తే సరిపోదు. సెల్ఫ్‌డిఫెన్స్‌ కూడా నేర్పించాలి.

ఎక్కడి నుంచి ఏ రాక్షసుడు వస్తాడో తెలియదు. ఎలా వేధిస్తాడో తెలియదు. వారి బారి నుంచి తమను తాము కాపాడుకునే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఆడపిల్లలకు ఇవ్వాలి. ఏడిస్తే ఇంకా ఇంకా ఏడిపిస్తారు. అందుకే ఏడ్చి కన్నీళ్ళను వృధా చేసుకోకూడదు అంటూ చెప్పుకొచ్చింది ఉదయభాను..

ఇవన్నీ నా అనుభవాల నుంచి నేర్చుకున్నాను. మన వైపు వేలెత్తి చూపించే వాళ్ళ వేలుని విరగ్గొట్టాలి. ప్రేమ పంచడంతో పాటు తేడా వస్తే తాట తీయాలి. ఇవన్నీ నా పిల్లలకు నేర్పిస్తాను. దీని గురించే ఓ పుస్తకం కూడా రిలీజ్‌ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఓ సాంగ్‌ కూడా రాశాను. అయితే నేను పెన్ను కదిలిస్తే విప్లవం వచ్చేస్తుందేమో అని ఆలోచిస్తున్నాను. కానీ పుస్తకం వివరాలు కూడా త్వరలోనే మీడియాకు చెబుతాను.

Advertisement

బలం, ధైర్యం తన భర్తేనని, ముందు మేం ఆర్థికంగా స్థిరపడాలనుకున్నామని, అన్నేండ్ల తమ ప్రేమకు సాక్షాలే తమ కవల పిల్లలని, వాళ్ళను చూస్తే తన ఒత్తిడి మొత్తం ఇట్టే ఎగిరిపోతుందని అంటోంది ఉదయభాను. తమ పెండ్లి చాలా స్ట్రగుల్‌ పడి చేసుకున్నామని, జీవితం అనుక్షణం ఓ యుద్ధం. ఆ యుద్ధంలో జయిస్తేనే బతుకు. విజరు అనే సోల్జర్‌ నా పక్కన ఉన్నన్ని రోజులు విజయం నాదే అని అంటోంది ఉదయభాను…

సమస్యలు లేకుండా జీవితమే ఉండదు. ‘భయం తలుపు తట్టింది.. ధైర్యం తలుపు తీసింది ఎదురుగా ఎవరూ లేరు’. ఇది నాకు బాగా నచ్చిన వాక్యం. ఛాలెంజెస్‌ వచ్చినప్పుడే మనలో ఉన్న శక్తి ఏమిటో మనకు తెలుస్తుంది. నా దృష్టిలో స్త్రీ ఎప్పటికీ ఒంటరి కాదు. తనలోపల ఓ శక్తి స్వరూపిణి దాగి ఉందని ఎప్పుడూ మర్చిపోకూడదు. సమస్య వచ్చినప్పుడు ప్రతి స్త్రీకీ తనని తానే ఓ సైన్యంగా మార్చుకునే సత్తా ఉంటుంది. ఎలాంటి సవాల్‌ ఎదురైనా ధైర్యంగా నిలబడగలుగుతుంది. దీనికి నేనే ఓ మంచి ఉదాహరణ.

స్ట్రాంగ్‌గా ఉండాలి. మనల్ని మనం నమ్ముకోవాలి. తొందర తొందరగా పైకి వచ్చేయాలనే ఆరాటం ఉండకూడదు. మన కష్టాన్నే నమ్ముకోవాలి. కష్టపడితే ఫలితం కచ్చితంగా ఉంటుంది. అన్నింటికంటే ముందు మనలోని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ చెక్కుచెదరనీయకూడదు. చిన్న వీక్‌ పాయింట్‌ దొరికినా మనతో ఆడుకోడానికి చాలా మంది ఎదురుచూస్తుంటారు. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అధైర్యానికి తావు ఇవ్వకూడదు. అంటూ ఒక సక్సెస్ ఫుల్ మహిళ గా తన మనోభావాన్ని ఆవిష్కరించింది…ఉదయభాను…

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!