Connect with us

General News

పుట్టిన నెలను బట్టి ఏ అమ్మాయి మనస్తత్వం ఎలా ఉంటుందో చూడండి..

Published

on

ఆడవారి మాటలకూ అర్ధాలు వేరులే అంటుంటాం. వారు ఎప్పుడు ప్రస్నార్ధకమ. ఓ పట్టాన అర్ధం కారు. ఎంత అర్ధం చేసుకోవాలని ప్రయత్నించినా అర్ధం కావడం లేదు అంటుంటారు. అయితే, ఆడవారిని అర్ధం చేసుకోవడానికి సహనం కావాలి. పురాణ కాలంలో శ్రీకృష్ణుడు, మహావిష్ణువు వంటి వారే ఆడవారిని అర్ధం చేసుకోవడానికి చాలా కాలం పట్టింది. ఇక మానవమత్రులమైన మనం ఎంత. వారు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదు. అలాంటి సమయంలో మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి. ఇకపోతే, ఆడవారు పుట్టిన నెలను బట్టి వారి మనస్తత్వం ఉంటుందట. మరి ఏ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారో ఇప్పుడు చూద్దాం.


1. జనవరి: ఈ నెలలో పుట్టిన వారు చాలా నిజాయితీగా ఉంటారట. వీరిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది. వీరి గురించి ఎవరైనా బయట వ్యక్తులు మాట్లాడుకుంటుంటే కోపగించుకుంటారు. అలాంటి వారిని ఎక్కువగా ద్వేషిస్తారు. వీరి స్వతంత్రంగా ఉండేందుకే ఆసక్తి చూపుతారు. నాయకత్వ లక్షణాలు వీరిలో ఎక్కువ.

2. ఫిబ్రవరి: వీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు. అలాగే వీరికి సహనం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులపై వీరికి ప్రేమ, ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి. అయితే, వీరు అంత తేలికగా ఎవరికీ అర్ధం కారు. ఎందుకంటే వీరి మూడ్ ఒక్కోసారి ఒక్కోరకంగా ఉంటుంది. ఇలాంటి ఆడవారిని ఎవరైనా మోసం చేశారంటే లైఫ్ లో వారిని మళ్లీ నమ్మరు.

Advertisement

3. మార్చి: ఈ నెలలో పుట్టిన అమ్మాయిల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. నిజాయితీగా, విశ్వాసంగా ఉంటారు. వీరు ఎవరినైతే నమ్ముతారో వారిపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు. వీరిని ప్రేమలో దింపాలంటే మాత్రం చాలా కష్టం. ఒక్కసారి వీరు మీ ప్రేమలో పడ్డారనుకో మీరు అదృష్టవంతులే. ఎందుకంటే జీవితాంతం మీతోనే ఉండాలని పిక్స్ అయిపోతారు. మీరు ఎన్ని కష్టాల్లో ఉన్న మీ నుంచి దూరంకారు. మీకు అండగా ఉంటారు.


4. ఏప్రిల్: ఏప్రిల్ నెలలో పుట్టిన అమ్మాయిలు మంచి తెలివైన వారు. ఎలాంటి పనినైనా వీరు ఈజీగా డీల్ చేయగలరు. ప్రతి ఒక్కరి మనస్సును సులభంగా దోచుకుంటారు. ఇక వీరు ప్రేమించిన వ్యక్తులు వీరిని కాకుండా ఇతరుల్ని ప్రేమిస్తే వీరు తట్టుకోలేరు. వీరికి అసూయ ఎక్కువ. వీరు చాలా డైనమిక్ గా, యాక్టివ్‌గా ఎట్రాక్టివ్ గా ఉంటారు.

5. మే: మే నెలలో పుట్టిన అమ్మాయిలు అందంగా ఉంటారు. వీరితో ప్రేమలో పడ్డారంటే ఇంకా అంతేసంగతులు. మీరు కచ్చితంగా డేంజర్ జోన్ లోకి వెళ్లినట్లే. వీళ్లు సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకోలేదు. వీరిలో హార్డ్ వర్క్ చేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు కాస్త నిజాయితీగా ఉంటారు.

6. జూన్: జూన్ లో పుట్టిన అమ్మాయిల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. మంచి కమ్యూనికేషన్స్ కలిగి ఉంటారు. ఏం మాట్లాడినా దానికి ముందు బాగా అలోచించి మాట్లాడుతారు. ఏ విషయాన్ని అయినా ముఖం మీదే చెప్పేస్తారు. మనుషుల వెనక మాట్లాడడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. అంతేకాదండోయ్ వీరు కాస్త ప్రమాదకరమైన వ్యక్తులు కూడా.

SAMSUNG CSC


7. జూలై : ఈ నెలలో పుట్టిన మహిళలు చాలా నిజాయితీగా ఉంటారు. అంతేకాదు చాలా అందంగా ఉంటారు. మంచి తెలివి గల వారు. వీరు విభేదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. చుట్టూ ఉన్న వ్యక్తులతో మర్యాదగా ఉంటారు. జాలి గుణం ఎక్కువ. రిలేషన్స్ ను కాపాడుకుంటారు. వీళ్లు ఒక్కసారి హర్ట్ అయ్యారంటే అంతేసంగతి. మళ్లీ వీళ్లు మామాలు మనుషులు కావడానికి చాలా టైమ్ పడుతుంది.

8. ఆగస్టు: ఆగస్ట్ లో పుట్టినవారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. మంచి మనస్సు, మనస్తత్వం కలిగి ఉంటారు. సెన్సార్ హ్యుమర్ కాస్త ఎక్కువే ఉంటుంది. ఇక అందరి దృష్టి ఎప్పుడూ వీరిపైనే ఉండాలని భావిస్తారు. ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా రొమాంటిక్ గా ఉంటారు.
9. సెప్టెంబర్: సెప్టెంబర్ లో పుట్టిన అమ్మాయిలకు జాలి, దయ ఎక్కువగా ఉంటుంది. క్రమశిక్షణ కూడా ఎక్కువే. అందానికి ప్రతిరూపంగా ఉంటారు. మోసగించిన వారిని వీరు అస్సలు క్షమించరు. ప్రతీకారం తీర్చుకునే వరకు వదలరు. వీరిని ఎప్పటికి కూడా ఇబ్బంది కలిగించకూడదు. వీరి కాబోయే భర్త విషయంలో చాలా ఎక్స్ పెక్టేషన్స్ కలిగి ఉంటారు. నిజాయితీగా, సెన్సిటివ్ గా ఉంటారు. మనసులో ఉన్న ఫీలింగ్స్ ను బయటకు చెప్పరు. అందుకే వీరిని అర్ధం చేసుకోవడం చాలా కష్టం.

Advertisement


10. అక్టోబర్ : అక్టోబర్ లో జన్మించిన మహిళలకు చిన్నచిన్న విషయాలకు భయపడే మనసత్వం ఉండదు. వీరికి భావోద్వేగాలు ఎక్కువ. వీరు చాలా స్మార్ట్ గా ఉంటారు. అయితే వీరి ఫీలింగ్స్ ను అందరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు. వీరు ఇతర మహిళలకు అంతగా నచ్చరు. ఈ నెలలో పుట్టిన అమ్మాయిలంటే మిగతా వారికి అసూయ ఎక్కువ. వీరుకొన్నిసార్లు కాన్ఫిడెన్స్ కోల్పోతారు.

11. నవంబర్: వీరు ఇతరులతో పోల్చుకుంటే ప్రతి విషయంలో ఒక అడుగు ముందే ఉంటారు. వీరి దగ్గర ఏదైనా అబద్దం చెబతే వెంటనే వీరు గుర్తుపడతారు. అందువల్ల వీరితో ఎప్పుడు కూడా అబద్దం చెప్పకూడదు. వీరు అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉంటారు. వీళ్లు చాలా తెలివైనవాళ్లు, చాలా షార్ప్‌గా ఆలోచిస్తారు.

12. డిసెంబరు: వీరేప్పుడు అసహనానికి గురవుతుంటారు. వీరు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే బలాన్ని కలగి ఉంటారు. ఏదైనా సమస్య వచ్చి మూడ్ బగాలేకున్నా వెంటనే తిరిగి మాములు స్థితికి ఎలా రావాలో వీరికి బాగా తెలుసు. వీళ్లు ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. చాలా తేలికగా లక్, వెల్త్ పొందుతారు.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Kumari Aunty: కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ పాత్ పై ఈమె ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ కాలం గడిపేది అయితే ఈమె వద్దకు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి తనని ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. దీంతో సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు రావడం మొదలుపెట్టారు. ఇలా కుమారి ఆంటీ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

కుమారి ఆంటీ బిజినెస్ రోజు రోజుకు పెరుగుతూ పోయింది. ఈమె వద్ద తక్కువ ధరకే ఎంతో రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను కడుపునిండా తినవచ్చు అనే విధంగా రివ్యూలు కూడా ఇవ్వడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా కుమారి ఆంటీ వద్ద ఫుడ్డు తినడం కోసం వచ్చేవారు అంటే తనకు ఎంత పాపులారిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో కనిపించి ఈమె సెలబ్రిటీ హోదాని కూడా అందుకున్నారు. ఈ విధంగా కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. ఇలా రోజుకు ఇంతమంది కస్టమర్లు ఈమె ఫుడ్ స్టాల్ వద్ద ఫుడ్ తింటూ ఉండడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఈమెకు నెలకు ఎంత మొత్తంలో ఆదాయం ఉంటుంది అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.

Advertisement

లక్షల్లో ఆదాయం…

ఈ క్రమంలోనే కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన నెల సంపాదన గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను ప్రతిరోజు చేసే ఆహార పదార్థాలు అలాగే అక్కడ పనిచేసే వారికి ఇచ్చే ఖర్చులన్నీ పోను నెలకు లక్షన్నర వరకు మిగులుతుంది అంటూ ఈ సందర్భంగా కుమారి ఆంటీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ ఉద్యోగం కంటే ఈ వ్యాపారమే బాగుందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Breaking News

Breaking News : డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.

Published

on

డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై స్టే విధించిన హైకోర్టు. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. తదుపరి విచారణ 8వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

Advertisement
Continue Reading

Featured

Ayodhya: అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. విమాన టికెట్ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే?

Published

on

Ayodhya: అయోధ్య.. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు మారుమోగిపోతోంది. గత కొద్దిరోజులుగా అయోధ్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. అందుకు కారణం కూడా లేకపోలేదు. జనవరి 22, 2024న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. దాంతో అయోధ్యకు సంబంధించిన వార్తలు విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు తీర్థయాత్రకు సిద్ధమవుతున్నారు.

అయోధ్యకు భక్తులు పోటెత్తడంతో, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమాన, రైలు ప్రయాణ ఎంపికలు కూడా నిర్వహించబడ్డాయి. ఇది ఇలా ఉంటే అయోధ్యకు విమానం ద్వారా వెళ్లాలి అనుకున్న వారికి ఒక చేదు వార్త ఎదురైంది. ఎందుకంటే ఈ అయోధ్యకు వెళ్లడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుండడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. జనవరి 19న ముంబై నుండి అయోధ్యకు వెళ్లే విమాన టిక్కెట్‌లను తనిఖీ చేయడం, ఇండిగో విమానం ప్రయాణానికి రూ. 20,700 కోట్ చేయడంతో అస్థిరమైన ధరలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా, జనవరి 20కి సంబంధించిన ఛార్జీలు దాదాపు రూ.20,000గా ఉంటాయి.

బెంగుళూరు నుండి కూడా, విమాన ఛార్జీకి మినహాయింపు లేదు. ధరలు సుమారు రూ. 8,500కి చేరుకుంటాయి. ఆశ్చర్యకరంగా, ఇప్పుడు అయోధ్యకు విమాన ఛార్జీలు అనేక అంతర్జాతీయ మార్గాలను మించిపోయాయి. ఇది తీర్థయాత్ర ఖర్చులకు ఊహించని కోణాన్ని జోడిస్తుంది. అంతర్జాతీయ విమానాలతో పోల్చి చూస్తే ఈ ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జనవరి 19న ముంబై నుంచి సింగపూర్‌కు వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ ధరను పరిశీలిస్తే ఎయిర్ ఇండియా రూ. 10,987 కోట్ చేస్తున్నట్టు చూపుతుండగా, అదే తేదీన నేరుగా బ్యాంకాక్ వెళ్లేందుకు రూ.13,800. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన పర్యాటకుల ప్రవాహం విమాన ఛార్జీలపై కాదనలేని విధంగా ప్రభావం చూపింది.

చార్జీల పెంపు…

Advertisement

ఈ విధంగా విమానంలో అయోధ్యకు చేరుకోవాలి అనుకున్న వారికి చార్జీల పెంపు ఊహించని షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా ధరలు పెంచేయడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా భక్తులకు ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా మొదలవుతున్నాయి. లక్షలాది మంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు, పెరుగుతున్న విమాన ఛార్జీలు ఊహించని అడ్డంకిగా నిలుస్తాయి, ఆర్థికపరమైన చిక్కులకు వ్యతిరేకంగా వ్యక్తులు తమ తీర్థయాత్ర ప్రాముఖ్యతను అంచనా వేయడానికి ప్రేరేపిస్తాయి. మరి ఈ విషయాలపై అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!