Connect with us

Uncategorized

వారాల పాటు తిండి తిప్పలు లేక కొడుకు చేత చావు దెబ్బలు తిన్న కోట్లాదిమంది అబిమాన తెలుగు హీరో..

Published

on

సినిమా పుట్టినప్పుటి నుంచి నటించడం ప్రారంభించారు. 1909లో జన్మించి, 1995 వరకు నటిస్తూనే ఉన్నారు. అతని జీవితం సినిమా వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఒక చక్కని పాఠం. హిందీ సినిమా తొలి లెజండర్… 50 మంది హేమా హేమీలైన హీరోయిన్లతో హీరోగా నటించారు. మూకీల కాలంలో మొదలైన అతని నటన 1995 వరకు సాగింది. రాజ్‌కపూర్ లాంటి వారికి దర్శకత్వం వహించారు. అతని జీవితం వారసులకు ఆస్తిని ఎలా ఇవ్వాలో సినిమా లోకానికి ఒక మంచి పాఠం చెప్పింది. ఎవరా నటుడు? ఏమా కథ తెలుసుకునే ముందు…. డబ్బు సంపాదన ఒక్కటే ముఖ్యం కాదు. సంపాదించిన డబ్బును జాగ్రత్త చేయాలని, సద్వినియోగం చేయాలి. చివరకు తన వారసులకు అప్పగించడం కూడా ఒక కళే ..మనం మన లెజెండ్ దగ్గరకు వద్దాం. ఎందుకంటే అతను కూడా తన ఆస్తిని వారసులకు ఎలా అప్పగించాలో తెలియక పోవడం వల్ల అంతిమ దశలో కలలో కూడా ఊహించని నిరాదరణకు గురయ్యారు. .

దాదాసాహెబ్ పాల్కె అవార్డు పొందిన తొలి తెలుగు వారు ఎవరు? అంటే అక్కినేని నాగేశ్వరరావు అని చెబుతారు. అక్కినేనికి 1991లో దాదాసాహెబ్ పాల్కె అవార్డు లభిస్తే, దశాబ్దం ముందు 1980లోనే ఓ తెలుగు నటునికి దాదా సాహెబ్ పాల్కే అవార్డు వచ్చింది. తెలుగు వాడే అయినా ఒక్క తెలుగు సినిమాలోనూ నటించలేదు. 11 మూకీ సినిమాలు, 170 వరకు హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ సినిమాల్లో నటించిన జైరాజ్ ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమాలోనూ కనిపించక పోవడం విచిత్రం. పి జయరాజ్ పేరు వినగానే హిందీ సినిమాల గురించి కనీస పరిచయం ఉన్న పాత తరం వారు ప్రతి ఒక్కరూ అద్భుతమైన నటుడు అంటారు. పి జయరాజ్ అసలు పేరు జైరుల నాయుడు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో పుట్టిన పైడిపాతి జైరుల నాయుడు హిందీతో పాటు గుజరాతి, మరాఠీ భాషల సినిమాల్లోనూ నటించిన జయరాజ్‌ను తెలుగు సినిమా ప్రపంచం పట్టించుకోలేదు. ఆయనా తెలుగు సినిమాను పట్టించుకోలేదు. జైరాజ్ తన ఆత్మకథలో, తనపై నిర్మించిన డ్యాకుమెంటరీలో తాను కరీంనగర్‌లో జన్మించానని చెప్పేంత వరకు జైరాజ్ మూలాల గురించి సినిమా వారికి పెద్దగా తెలియదు. సరోజినీనాయుడుకు దగ్గరి బంధువు అయిన జైరాజ్ పుట్టింది కరీంనగర్‌లో.. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో చదువుకున్నారు.

Advertisement

వయసులో ఉన్నప్పుడు జైరాజ్‌కు ఇంగ్లాండ్ వెళ్లి చదువుకోవాలని ఆసక్తిగా ఉండేది. తల్లి తన అన్నకే ప్రాధాన్యత ఇస్తుందనే కోపంతో 1929లో ఇంట్లో నుంచి బొంబాయికి పారిపోయాడు. ఓడరేవులో పనికి కుదిరాడు. అక్కడ సినిమా పోస్టర్లు వేసేవారు. ఆ సమయంలోనే అనేక మూకీ సినిమాల్లో నటించారు. రైఫిల్‌గర్ల్, బాబీ, హమారా బాత్ వంటి మూకీ సినిమాల్లో నటించారు. తరువాత స్వామి, తమన్న, హతిమ్‌తాయి సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించారు. తొలి తరం సౌందర్య రాశులు మీనా కుమారి, మధుబాల, సురయలతో నటించారు. దిలీప్‌కుమార్ సినిమాకు దర్శకత్వం వహించారు. జైరాజ్ నటించిన చివరి సినిమాల్లో ఒకటి ఖూన్‌బరీ మాంగ్. రేఖ, రిషికపూర్, కమల్ హసన్‌ల, డింపుల్ కపాడియాలతో కలిసి నటించారు. చిత్రంగా ఇదే పేరుతో జైరాజ్ ప్రారంభంలో ఒక సినిమా రూపొందించారు. అందులో భరత్‌భూషణ్, నర్గీస్‌తో పాటు జైరాజ్ నటించారు. చారిత్రక, పౌరాణిక సినిమాల్లో మంచి గుర్తింపు పొందారు. టిప్పుసుల్తాన్, హైదర్ అలీ బేగ్, రాణాప్రతాప్‌గా నటించి మంచి గుర్తింపు పొందారు. హిందీ సినిమా రంగంలో అత్యంత గౌరవం పొందిన నటుడాయన. ఆయన జన్మదినం రోజున ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులు, సినీ ప్రముఖులంతా జైరాజ్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పేవారు. ఈ సంప్రదాయం చాలా కాలం వరకు సాగింది. క్రమంగా జైరాజ్ సినిమా ప్రపంచాన్ని వదిలి ఇంటికి పరిమితం అవుతూ వచ్చిన కాలం వరకు ఇది సాగింది.

కొత్త తరం వచ్చింది… కొత్త పోకడలు, జైరాజ్ ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వచ్చింది. .నా జీవితం చివరి దశలోఇంట్లో నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. అంటూ జైరాజ్ కోర్టులో వాపోవడం కంటతడిపెట్టించింది. హిందీ సినిమా ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన జైరాజ్ 91 ఏళ్ల వయసులో ప్రశాంతమైన జీవితం కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా ఎంతో సంపాదించాడు. ముంబైలో ఎన్నో ఆస్తులు ఉన్నాయి. తన కుమారుడు దిలీప్‌రాజ్ వ్యాపారం ప్రారంభిస్తున్నానని చెప్పగానే ఆస్తులను అమ్మి ఇచ్చాడు. కుమారునిపై అజమాయిషీ చేసే వయసు కాదు అతనిది. ఏదో కొత్త వెంచర్ ప్రారంభిస్తున్నాను , డబ్బు కావాలి అని కుమారుడు అడిగితే తండ్రి ఇవ్వలేదు. హాకీస్ట్రిక్ తీసుకొని కుమారుడు తండ్రిని కొట్టాడు. ఇంట్లోకి సందర్శకులు రావద్దని, ఫోన్ చేయవద్దని ఆంక్షలు విధించారు. దీంతో స్నేహితులు, పెద్దలు వచ్చి పంచాయితీ చేశారు. దిలీప్‌రాజ్‌ను ఇంటి నుంచి పంపించి వేశారు. కుమారుడి ఖర్చుల కోసం తండ్రి ప్రతి నెల డబ్బు ఇవ్వాలనే ఒప్పందం కుదిరింది. కొంత కాలం గడిచాక జైరాజ్ భార్య మరణించిన తరువాత దిలీప్‌రాజ్, ఆయన భార్య వచ్చి నార్త్‌వెస్ట్ ముంబైలోని ఫాలీ హిల్స్‌లోని జైరాజ్‌కు చెందిన ఫ్లాట్‌ను ఆక్రమించేసుకున్నారు. చివరకు జైరాజ్‌ను ఆయన ఇంట్లోనే బందీగా మార్చేశారు. ఓ రోజు జైరాజ్ ఫోన్ చేసి తన కుతూరికి కన్నీరు పెడుతూ తనను హింసిస్తున్నారని ఎలాగైనా వచ్చి రక్షించమని కోరాడు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న తన తండ్రి దయనీయంగా ఏడవడాన్ని కూతురు తట్టుకోలేక పోయింది. కలకత్తాలో ఉన్న కూతురు వెంటనే ముంబై వచ్చింది.

కనీసం సరైన దుస్తులు కూడా లేవు, గదిలో వాసన వస్తోంది, స్నానం చేసి ఎన్ని రోజులు అయిందో అనిపిస్తోంది. వెంటనే డాక్టర్‌ను పిలవడంతో ఆయన చికిత్స ప్రారంభించారు. చూసి పోదామని వచ్చాను కానీ పరిస్థితి చూశాక ఇలా వదలివెళ్లలేక పోయాను అంటూ జైరాజ్ కుమార్తె గీత జరిగిన విషయం కోర్టుకు చెప్పింది. నా చివరి రోజులు ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను. అంటూ జైరాజ్ న్యాయమూర్తికి చెప్పారు. ఆ ఫ్లాట్‌పై తండ్రికే అధికారం ఉందని, కుమారుడు రోజుకు ఒకసారి చూసి వెళ్లడం తప్ప అక్కడ ఉండేందుకు వీలు లేదని కోర్టు ఆదేశించింది. ఆ తరువాత జైరాజ్ ఎక్కువ రోజులు బతకలేదు. 2000 సంవత్సరం ఆగస్టు 11న జైరాజ్ కన్ను మూశారు. ఆస్తులు పెంచుకోవడమే కాదు పిల్లలకు తల్లిదండ్రులపై అభిమానం అనే డిపాజిట్ కూడా పెంచుకోవాలి.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Crime News : ఆరు నెలలుగా మైనర్ బాలికపై లైంగిక దాడి… ఒంటిపై పంటిగాట్లు గుర్తించి !

Published

on

Crime News : కాలం గడుస్తున్న కొద్దీ మహిళలు, ఆడపిల్లలపై ఆకృత్యాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. కౌమార దశలో ఉండే పదమూడు సంవత్సరాల మైనర్ బాలిక శారీరంగా వచ్చే మార్పులు ఆమెను ఓ దారుణానికి వాడుకున్నాయి. తాను ఏం చేస్తున్నానో తెలియని చిన్న వయస్సు ఒకవేళ తెలిసినా.. దాని పరిణామాలు ఎలా ఉంటాయో చేసుకోని వయస్సులో ఉంది ఆ చిన్నారి. అయితే ఓ కామ పిశాచికి ఇవే అనుకూలంగా మారాయి.

minor girl sexually attacked from past six months in hyderabad
minor girl sexually attacked from past six months in hyderabad

ఆ చిన్నారీలో వచ్చే శారీరక మార్పులకు తీయని మాటలు చెప్పి తనకు కావాల్సిందేదో తీసుకునేందుకు శతవిధాల ప్రయాత్నాలు చేశాడు. వాడి ప్రయత్నాలకు ఆ బాలిక లొంగిపోయింది. తనకు కావల్సిన విధంగా ప్రవర్తించింది. దీంతో ఆమెను శారీరంగా వాడుకున్నాడు. అదే క్రమంలో శరీరంపై కొరికాడు… కాని ఆ పంటిగాట్లు వాడి పైశాచికత్వాన్ని బయటపెట్టాయి. రెండు రోజుల క్రితం బాలిక ఒంటిమీద పంటిగాట్లను చూసిన తల్లి ఏమైందని అడిగారు. దీంతో జరిగిన విషయాన్ని ఆ బాలిక పూసగుచ్చినట్టు చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది.

minor girl sexually attacked from past six months in hyderabad
minor girl sexually attacked from past six months in hyderabad

జహిరాబాద్‌కు చెందిన మహ్మద్ మోహిజ్‌కు 20 సంవత్సరాలు. అతను నగరంలోని ఎమ్‌ఎస్ మక్తాలోని తన సోదరీ నివాసంలో ఉంటూ వెల్డింగ్ వర్క్స్ చేస్తున్నాడు. అయితే వారు ఉండే ఇంటిలోనే మరో కుటుంబం కూడా అద్దెకు ఉంటుంది. ఆ ఇంట్లో ఓ మైనర్ బాలిక ఉండడంతో మోహిజ్ ఆ బాలికపై కన్నేశాడు. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆమెను బిల్డింగ్ పైకి తీసుకువెళ్లి లైంగిక చర్యకు పాల్పడుతున్నాడు.

ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుందంటే ?

ఇలా ఆరు నెలలుగా తన వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు. అయితే ఇటివల ఆ బాలిక శరీరంపై పంటి గాట్లు ఉండడాన్ని గమనించిన తల్లిదండ్రులు గమనించారు. దీంతో ఏం జరిగిందని నిలదీయడంతో ఆసలు విషయం చెప్పింది. దీంతో మోహిజ్ చేసిన దురాగతంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోహిజ్‌ను పట్టుకుని దేహశుద్ది చేశారు. ఆతర్వాత స్థానిక పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Continue Reading

Featured

Viral News : ఒక్క నిమిషంలో ఆ ఘనత సాధించి గిన్నీస్ బుక్ లో చోటు… ఆ కుర్రాడు ఎవరంటే ?

Published

on

Viral News : గిన్నీస్‌ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్‌ సాధించడం అంటే గొప్ప విషయం అనే చెప్పాలి. అలాంటి రికార్డ్‌ సృష్టించిన వ్యక్తిని తలదన్ని కొత్త రికార్డు సృష్టించడం ఇంకా కష్టం. కానీ మణిపూర్‌కి చెందిన బాడీ బిల్డర్‌ గిన్నీస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్‌ని అతి సునాయాసంగా బద్దలు కొట్టాడు. 24 సంవత్సరాల తౌనోజామ్‌ నిరంజోయ్‌ సింగ్‌ అనే యువకుడు కేవలం నిమిషంలో చేతి వేళ్లను నేలపై మోపి అత్యధిక పుష్‌ అప్‌లు తీసి ఔరా అనిపించాడు.

manipur young boy create world record and got place in guinness book
manipur young boy create world record and got place in guinness book

గతంలో 2009 మే 25న యునైటెడ్ కింగ్డమ్‌ కి చెందిన గ్రాహం మాలీ నిమిషంలో 105 పుష్‌ అప్‌ చేసి గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్ నెలకోల్పితే…అతడి రికార్డును బద్దలు కొట్టాడు నిరంజోయ్‌ సింగ్‌. జనవరి 14న ఇంపాల్‌లో ఈ అరుదైన రికార్డును సృష్టించాడు నిరంజోయ్‌సింగ్‌. గిన్నీస్‌ వరల్డ్ రికార్డ్‌ ప్రతినిధులు, స్థానికుల సమక్షంలో కేవలం 60 సెకన్లలో 109 పుష్‌ అప్స్‌ చేసి తన పేరును గిన్నీస్‌ బుక్‌లో ఎక్కేలా చేశాడు నిరంజోయ్‌ సింగ్.

manipur young boy create world record and got place in guinness book
manipur young boy create world record and got place in guinness book

నిరంజోయ్‌ సింగ్‌కు పుష్‌ అప్స్‌లో గిన్నీస్‌ వరల్డ్ రికార్డ్ సాధించడమే కాదు గతంలో కూడా ఎన్నో క్రీడలు, ఆటలతో పాటు బాడి బిల్డింగ్‌లో పతకాలు సాధించాడు. మణిపాల్‌ లోని ఇంపాల్‌ ప్రాంతంలో ఇలాంటి యువకులు చాలా మంది యువకులు నిరంజోయ్‌సింగ్‌ని ఆదర్శంగా తీసుకొని క్రీడలపై ఆసక్తి పెంచుకుంటున్నారు.

మణిపూర్ ఆణిముత్యం అంటూ ప్రశంసిస్తున్న ప్రముఖులు…

మణిపూర్‌కి చెందిన ఈ యువకుడు సాధించిన ఈ ఘనతను కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు అభినందించారు. ఊహించని విజయాన్ని దక్కించుకున్నావు అంటూ ట్వీట్‌ చేశారు కిరణ్‌ రిజిజు. అలానే 24 సంవత్సరాల యువకుడు నిమిషంలో 109 పుష్‌ అప్స్ చేయడం గొప్ప విషయమని మణిపూర్‌ మంత్రులు, జిల్లా కలెక్టర్‌ చెప్పుకొచ్చారు. నిరంజోయ్‌సింగ్‌ని సన్మానించారు. నిమిషంలో 120 పుష్‌ అప్స్ చేసేందుకు ప్రయత్నిస్తానంటున్నాడు నిరంజోయ్‌సింగ్‌. అతని ప్రయత్నం సఫలం కావాలని… మరో రికార్డు నెలకోల్పాలని అందరం కోరుకుందాం.

Advertisement

Continue Reading

Featured

Cyber Crime: మెడికల్ కంపెనీకి భారీ టోకరా వేసిన సైబర్ నేరగాళ్ళు… ఒక్క మెయిల్ తో !

Published

on

Cyber Crime: దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్ లావాదేవీల పెరుగుదలతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసగాళ్లు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. మీ వివరాలను అప్‌డేట్ చేస్తున్నట్లు ఫోన్ చేయడం, మీకు ఉద్యోగం వచ్చిందంటూ ఫోన్ చేయడం, మీ ఖాతాను బ్లాక్ చేస్తానని బెదిరించడం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా వేర్వేరు మార్గాల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు.

cyber crime happened in hyderabad and looted money with fake mail
cyber crime happened in hyderabad and looted money with fake mail

తాజాగా హైదరాబాద్‌కు చెందిన మెడికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ కంపెనీ యాజమాన్యానికి భారీ టోకరా వేశారు. ఒక్క మెయిల్‌తో ఏకంగా రూ. 46 లక్షలు కాజేశారు. అది నిజమైన మెయిల్ కాదని, సైబర్ నేరగాళ్ల మాయ అని గుర్తించిన కంపెనీ యాజమాన్యం… సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు, బాధితులు చెప్పిన వివరాలు ప్రకారం… నగరంలోని సంతోష్‌ నగర్‌లో గల ‘సెన్స్‌కోర్‌ మెడికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌’ మెడికల్‌ ఏజెన్సీ, కాలిఫోర్నియోలోని ‘ఏజీ సైంటిఫిక్‌’ కంపెనీతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోంది.

cyber crime happened in hyderabad and looted money with fake mail
cyber crime happened in hyderabad and looted money with fake mail

ఇందులో భాగంగా ఏడాదిలో మూడు సార్లు ‘ఏజీ సైంటిఫిక్‌’ నుంచి మెడికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను సెన్స్‌కోర్ మెడికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏజెన్సీ కొనుగోలు చేస్తుంటుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్‌ అవసరం ఏర్పడటంతో.. ‘ఏజీ సైంటిఫిక్‌’వారిని సంప్రదించారు ఇక్కడి ఏజెన్సీ వారు. అయితే, ఏజీ సైంటిఫిక్‌ వాళ్లు తమ బ్యాంక్‌ ఖాతాను ప్రతి మూడు నెలలకు మారుస్తుంటారట. దీనిని పసిగట్టిన సైబర్ నేరగాళ్లు… పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకున్నారు. ‘ఏజీ సైంటిఫిక్‌’ కంపెనీలో ‘ఐ’ అనే లెటర్‌ తీసేసి ఫేక్‌ మెయిల్‌ సృష్టించారు.

మెయిల్ హ్యాక్ చేసి ఎన్ని లక్షలు కాజేశారంటే ?

ఆ ఫేక్‌ మెయిల్‌తో రూ.46 లక్షలకు కొటేషన్‌ను పంపి బ్యాంక్‌ అకౌంట్‌ను కూడా పంపారు. అయితే, ఏజీ సైంటిఫిక్ వారు బ్యాంక్‌ అకౌంట్లను మారుస్తుంటారని, ఈ సారి కూడా అలాగే మార్చి ఉంటారని భావించి వాళ్లు అడిగిన రూ.46 లక్షలను కేటుగాళ్ల పంపిన అకౌంట్లకు పంపారు. అయితే, ఇదంతా గత ఏడాది సెప్టెంబర్‌లో చోటు చేసుకోగా… తాజాగా మీ డబ్బులు రాలేదంటూ ఏజీ సైంటిఫిక్ వాళ్లు మెయిల్ పెట్టడంతో విషయం వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Continue Reading
Advertisement

Trending

Don`t copy text!