దేశం కోసం 20 లక్షల కోట్ల రూపాయల ఆర్ధిక ప్యాకేజిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ అభియాన్ పేరుతో కొత్త ఆర్థిక ప్యాకేజీ అందిస్తామని చెప్పారు. ఈ ప్యాకేజి విలువ దాదాపు దేశ జీడీపీ 10 శాతంగా వరకు ఉంటుంది. ఆత్మ నిర్బర్ భారత్ కు కావాల్సిన ఆర్ధిక ధన్నును ఈ ప్యాకేజి అందిస్తుంది. ఆ ఆర్ధిక ప్యాకేజి కరోనాపై పోరాటంలో ప్రతి ఒక్కరికి చేయూతనిస్తుంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఊతం అందిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. ఈ క్రమంలో దేశంలో ఉన్న ప్రతి పారిశ్రామికుడిని కలుపుకుని పోయేలా ఈ ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని ఆయన చెప్పారు. కరోనాపై జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరికీ చేయూతని అందిస్తుందని ప్రధాని అన్నారు. అయితే ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను రేపటి నుంచి ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ అందిస్తారని తెలిపారు ప్రధాని మోదీ.

కరోనా నుంచి రక్షించుకోవాలి.. అదే సమయంలో ముందుకు సాగాలి అని ప్రధాని చెప్పారు. కరోనాకు ముందు కరోనా తర్వాత విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, భారత్‌లో కూడా అనేక మంది అయినవారిని కోల్పోయారు అయన ప్రసంగంలో అన్నారు. భారత్‌ సర్కార్‌ నుంచి వెళ్లే ప్రతి రూపాయి ప్రతి శ్రామికుడి, రైతు జేబులోకి నేరుగా వెళ్తుంది భవిష్యత్తులో వ్యవసాయంపై ఎలాంటి ప్రభావం పడకుండా ఏర్పాట్లు మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి ఈ ప్యాకేజీ మరింత బలాన్ని చేకూరుస్తుంది చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఊతం ఇచ్చేవిధంగా ఉంటుందని తన ప్రసంగంలో తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here