పుట్టినరోజు నాడే నాగభూషణం ఎలా చనిపోయారో తెలుసా..?

0
675

తెలుగు రాష్ట్రాల్లో నటుడు నాగభూషణం గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. సినిమాల్లో హీరోని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించే కన్నింగ్ విలన్ పాత్రలో నాగభూషణం అద్భుతంగా నటించేవాడు. ప్రేక్షకులు కూడా మెచ్చుకునే విలనిజానికి నాంది పలికిన ఏకైక ప్రతినాయకుడిగా నాగభూషణం నిలిచారు అంటే అతిశయోక్తి కాదు. ఇతడు రక్త కన్నీరు సినిమా లో రక్త కన్నీరు నాగభూషణం అనే పాత్రలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

విలనిజానికి కూడా కామెడీ టచ్ ఇవ్వొచ్చని ఒక సరికొత్త ట్రెండ్ ని తెలుగు పరిశ్రమకి రుచి చూపించిన నాగభూషణం ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. సినిమాల్లో, నాటకాలలో ఏకకాలంలోనే బ్రహ్మాండమైన నటన ప్రతిభ చూపించి వావ్ అనిపించిన సమర్థవంతమైన నాగభూషణం జీవితం గురించి తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. మొత్తం కలిపి 395 పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నాగభూషణం ఎలా చనిపోయారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

1922 మే 5 వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలోని కొండేపి మండలం, అనకర్లపుడి గ్రామంలో నాగభూషణం జన్మించాడు. సినిమాల్లో నాటకాల్లో ఎంతో కాలం పాటు నటించిన నాగభూషణం యొక్క ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిపోయింది. దీంతో అతడు తన పుట్టినరోజు నాడే అనగా 1995 మే 5వ తేదీన మృత్యు ఒడికి చేరుకున్నాడు. అప్పట్లో నాగభూషణం పుట్టినరోజు నాడే చనిపోవడంతో చాలా మంది సినీ అభిమానులు, ప్రముఖులు విశేషంగా భావించారు. ఇకపోతే నాగభూషణానికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, ఆరుగురు మనవళ్లు మనవరాళ్లు పిల్లలు ఉండగా… వీరిలో ఎవరూ సినిమా పరిశ్రమలోకి రాలేరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here