అసలు ప్రేమ, పెళ్లి అనే పదానికి అర్థాలు మారిపోతున్న రోజులు ఇవి. ఎవరితో ఎప్పుడు ప్రేమలో పడతారో తెలియదు ఎలా విడిపోతారో తెలియదు. ప్రేమించడానికి పట్టిన సమయం విడిపోవడానికి పట్టట్లేదు. ఇది సెలెబ్రేటిస్ నుండి మాములు మనుషుల వరకు ఒకేలా ఉంది పరిస్థితి. ఒకసారి ప్రేమ పెళ్లి విషయంలో ఓడిపోయామని ఎవరు ఖాళీగా బాధపడుతూ కూర్చోవడం లేదు. ఫటా ఫట్ గా మళ్ళీ ప్రేమలో పడిపోతున్నారు, పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మన టాలీవుడ్లో మరియు సౌత్ ఇండియాలో ఈ కల్చర్ ఎప్పటి నుండో ఉంది..

పెళ్లయిన హీరోయిన్స్ ని, నటీమణులని సినిమా సెట్లో కలిసి నటిస్తున్న సమయంలో మనసు పారేసుకుంటున్నారు మన హీరోలు. మరి ఇలా పెళ్లయినా హీరోయిన్స్ ప్రేమలో పడి మళ్ళీ పెళ్లి చేసుకున్న నటులెవరో చూద్దాం.

మొదటగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న రాధిక.. ఈమె మ్యారేజ్ లైఫ్ పైన ఇప్పటికే అనేక సార్లు చర్చించుకున్నాం… రెండు సార్లు జీవితంలో పెళ్లి విషయంలో విఫలం అయ్యి ఒక బిడ్డతో జీవిస్తున్న రాధికను అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న శరత్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ఒంటరి తనంతో ఉండటం వల్ల ఒక షూటింగ్ సందర్భంగా ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వీరు పెళ్లి చేసుకొని అన్యోన్యంగానే కాపురం చేసి మరొక కుమారుడికి జన్మ ఇచ్చి సంతోషంగా జీవిస్తున్నారు.

ఇక మరొక సీనియర్ నటి సీత. తల్లి పాత్రలకే హుందాతనం తెచ్చిన నటి సీత జీవితం లో కూడా అనేక ఆటుపోట్లు ఉన్నాయ్. తమిళ్ స్టార్ పార్తీబన్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు కూతుళ్లు పుట్టాక మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఆ ఎడబాటులో అలాగే ఉండకుండా సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది సీత, ఆ సమయంలో షూటింగ్ స్పాట్ లో బుల్లి తెర హీరో సతీష్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇక అనుకున్నదే తడవు ఇద్దరు పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు బాగానే ఉన్న సీత సతీష్ తో కూడా విడిపోయి ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది.

ఇక మరొక హీరో కమల్ హాసన్. సీనియర్ హీరోయిన్ గౌతమిని ప్రేమించడానికి ముందే కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. అంతే కాదు వాణి గణపతితో కమల్ కి మొదట పెళ్లయిన కూడా సారికను ప్రేమించి వాణికి విడాకులు ఇచ్చారు. అలాగే గౌతమితో సెట్లో మనసు పారేసుకుని సారికకు విడాకులు ఇచ్చాడు. అప్పటికే పెళ్లయి ఒక కూతురికి తల్లయిన గౌతమి కమల్ ప్రేమలో నిజాయితీని వెతుకుంది కానీ పదేళ్ల సహజీవనం తర్వాత కమల్ కి బ్రేకప్ చెప్పి విడిపోయింది.

ఇక క్రైమ్ స్టోరీని మించింది హీరోయిన్ కావ్య మాధవన్ మరియు దిలీప్ ల ప్రేమ కథ. వీరిద్దరి కంబినేషన్లో ఇరవైకి పైగా సినిమాలు వచ్చాయి. కానీ దిలీప్ కి మంజు వారియర్ అనే హీరోయిన్ తో ప్రేమ పెళ్లి జరిగి ఒక కూతురు కూడా ఉంది. అలాగే కావ్య మాధవన్, దిలీప్ ల మధ్య షూటింగ్ లొకేషన్స్ లో కుదిరిన గాఢమైన బంధం ఉంది. కానీ ఇంట్లో వాళ్ళు అడ్డు చెప్పడంతో కావ్య మాధవన్ కి వేరే పెళ్లి చేసారు. సరిగా మూడు నెలలు తిరక్కుండానే కావ్య అతడిని కోర్టుకి ఈడ్చి నానా రభస చేసి విడాకులు తీసుకుంది. ఇక దిలీప్ కూడా మంజుతో తెగదెంపులు చేసుకొని కావ్యను పెళ్లి చేసుకున్నాడు. ఇక దిలీప్ నటి భావనతో కాస్త క్లోజ్ గా ఉంటున్నాడని ఆమెను కావ్య మాధవన్ కిడ్నాప్ చేయించి బెదిరించిన కేసు ఇప్పటికి నడుస్తుంది. ఈ కేసులో ఏడాది కి పైగా జైల్లో బెయిల్ దొరక్కుండా ఉన్నాడు దిలీప్. ఏది ఏమైనా కావ్య మాధవన్ తో ప్రేమ ఆ తర్వాత పెళ్లి ఒక సినిమా తీసిన సరిపోదు. వీరి వైవాహిక బంధం మాత్రం సజావుగానే సాగుతుంది.

మరొక సీనియర్ హీరోయిన్ లక్ష్మి కి సైతం పెళ్లిళ్ల విషయం లో ఒక రికార్డు ఉంది. మొదట చిన్న వయసులోనే పెళ్లి చేయడంతో కూతురు ఐశ్వర్య పుట్టగానే విడాకులు తీసుకుంది. అలాగే అప్పటికే తమిళ్ లో స్టార్ గా ఉన్న నటుడు భాస్కర్ రావు ఆమెతో షూటింగ్ లొకేషన్ లో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు కానీ ఈ బంధం చాన్నాళ్లు నిలవలేదు.

O. A. K. సుందర్ తో నటి అంజు సైతం షూటింగ్ లొకేషన్ లో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. కానీ అంజు కి అప్పటికే విలన్ గా నటించే టైగర్ ప్రభాకర్ తో పెళ్ళై విడాకులు అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here