ఈమధ్యనే బాలీవుడ్ ధోనీగా మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డిప్రెషన్ కు గురై మరణించడంతో దేశం మొత్తం దిగ్భ్రాంతి చెందిన విషయం తెలిసిందే. సుశాంత్ ‘డిప్రెషన్ కు గురవడానికి ప్రధాన కారణం.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో పాతుకుపోయి ఉన్న నేపోటిజమే’ అంటూ నేటికీ మండిపడుతున్నారు నెటిజన్లు. అంతేకాదు అలాంటివాళ్ళ సినిమాలను ‘బ్యాన్ చెయ్యాలి’ అంటూ నిరసనలను కూడా వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. టాలీవుడ్ లో కూడా నెపోటిజం ఉందంటూ సుశాంత్ లాగే మరణించిన యంగ్ హీరో ఉదయ్ కిరణ్ సంఘటనని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో స్టార్ హీరోలపై కూడా విమర్శలను గుప్పిస్తున్నారు నెటిజన్లు. ఆ విమర్శలలో భాగంగా ‘జూనియర్ ఎన్టీఆర్ కూడా నెపోటిజంకు చెందిన హీరోయే’ ఎన్టీఆర్ కూడా నట వారసత్వంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయే” అని.. కొందరు కామెంట్స్ చెయ్యగా.. ఆ కామెంట్స్ కి ధీటుగా చాలా ఘాటుగానే బదులిచ్చింది టాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్. టాలీవుడ్ లో అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ పై వస్తున్న కామెంట్స్ ను ఖండిస్తూ.. ‘‘నెపోటిజంపై వస్తున్న కామెంట్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇలా కామెంట్స్ చేసేవాళ్ళకు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఖచ్చితంగా ఏమీ తెలిసి ఉండదు. అతనో హార్డ్ షిప్ ఎంతో కష్టపడి వచ్చాడు. సో వీళ్ళంతా మూసుకుని ఉంటే మంచిదంటూ జూనియర్ ఎన్టీఆర్‌ వ్యక్తిత్వాన్ని తెలియజేసేందుకు అతనితో కలిసి నటించిన ‘ఊసరవెల్లి’ చిత్రం షూటింగ్ లో జరిగిన ఒక సంఘటనను వివరించింది. ఎన్టీఆర్‌ స్త్రీలను చాలా గౌరవిస్తారు. ‘ఊసరవెల్లి’ చిత్రం షూటింగ్ టైంలో ఓ పాట షూటింగ్‌ కోసం బ్యాంకాక్‌ వెళ్లాం. ఆ టైంలో నేను బట్టలు మార్చుకోవల్సి వచ్చినప్పుడు మా కోసం చిన్న టెంట్‌ లాంటిదాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ మా ఇబ్బందిని గమనించి మాకోసం ఆయన బయటకు వెళ్ళిపోయారు. ఆ ఒక్క సంఘటన చాలు.. స్త్రీలంటే ఎన్టీఆర్‌కి ఎంతో గౌరవం అని చెప్పడానికి.. ” అంటూ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కీ నెపోయిజం ను లింక్ పెడుతూ కామెంట్స్ పెట్టినవారిపై తీవ్రంగానే మండిపడింది.

పాయల్‌ ఘోష్‌ తెలుగులో మంచు మనోజ్‌తో కలిసి ‘ప్రయాణం’ చిత్రంలో కథానాయికగా నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు దివంగత రిషి కపూర్‌తో కలిసి పాయల్‌ ఘోష్‌ 2017లో ‘పటేల్‌ కి పంజాబీ షాదీ’ చిత్రంలో నటించింది. అదండి సంగతి.. మొత్తానికి కుర్రహీరోలు ఉదయ్ కిరణ్, సుశాంత్ ల సూసైడ్ వివాదాల పుణ్యమా అని నెపోటిజం అంశం రోజురోజుకీ అన్ని సినీ ఇండ్రస్ట్రీలని కుదిపేస్తుందన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here