డేరింగ్ స్టెప్ వేస్తున్న అక్కినేని వారసుడు !! అఖిల్ నిర్ణయంతో భయపడుతున్న నాగార్జున..!

0
353

టాలీవుడ్ అనగానే NTR, ANR పేర్లే వినబడతాయి. వీళ్ళిద్దరూ తెలుగు సినీ రంగానికి 2 కళ్లుగా
చెప్పుకుంటారు. ఇప్పుడూ వీళ్ళిద్దరూ లేకపోయినా వాళ్ళ మూడోతరం కూడా తెలుగు సినీరంగంలో కొనసాగుతోంది. అయితే అక్కినేని వంశానికి చెందిన టాలీవుడ్ కింగ్ నాగార్జున తండ్రికి తగ్గ కొడుకులాగే తన టాలెంట్ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఈమధ్యకాలంలో నాగ్ కొడుకులు నాగచైతన్య, అఖిల్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. నాగ చైతన్య కొంచెం పర్వాలేదు గానీ, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ తో అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇంతవరకు 3 సినిమాలలో హీరోగా నటించినా సరే, ఒక్క హిట్ కూడా అతని ఖాతాలో పడ లేదు. మొదటి సినిమా ‘అఖిల్’ తోనే పెద్ద డిజాస్టర్ ను మూట గట్టుకుని, అప్పటినుండి హిట్ కోసం తపిస్తున్నాడు అఖిల్. సాధారణంగా కొత్త కథలను తెలుగు ప్రేకకులెప్పుడూ ఆదరిస్తుంటారు. ఇంత వరకూ మాస్ కథల్నీ వదిలీ ప్రేమ కథలను మాత్రమే ఎంచుకున్న అఖిల్ కి అదృష్టం కలిసి రావట్లేదనే చెప్పాలి.

ప్రస్తుతం అఖిల్ తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునే దిశగా అడుగులేస్తూ.. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ సరసన మన టాలీవుడ్ జిగేల్ రాణీ పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని అఖిల్ చాలా పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు అఖిల్ తండ్రి నాగార్జున కూడా తన వంతుగా కొడుక్కి మాంచి హిట్ అందించాలనీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలలో భాగంగానే ఈమధ్యనే ఈ సినిమాను చూసిన నాగార్జున సినిమా అవుట్ పుట్ పట్ల సంతోషంగా ఉన్నాడని తెలిసింది. ఇక ఈ సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సమ్మర్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా గత 4 నెలలుగా షూటింగ్ లన్నీ ఆగిపోయి చిత్ర యూనిట్ అంతా ప్రస్తుతం ఎవరి ఇళ్ళకు వాళ్ళే పరిమితమైపోయారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ షూటింగ్స్ ను మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చని అనుమతులు ఇచ్చినా కూడా ఇంకా కరోనా వైరస్ సోకుతుందనే భయంతో ఎవరూ ఈ చిత్రం షూటింగ్ ను స్టార్ట్ చేయడం లేదు.

ఈ నేపథ్యంలో ఈ చిత్ర కధానాయకుడు అఖిల్ మాత్రం కరోనాను సైతం లెక్క చేయకుండా ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న తపనతో డేరింగ్ స్టెప్ వేస్తున్నాడు. ఈయన తన సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ షూటింగ్ ను మళ్ళీ మొదలు పెట్టబోతున్నాడు. మరో 15 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండటంతో దాన్ని ఎలాగైనా సరే పూర్తి చేయాలని దర్శక, నిర్మాతలు కూడా అఖిల్ అడుగుజాడల్లోనే నడుస్తూ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్, వాసు వర్మ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో అఖిల్ మళ్లీ మేకప్ వేసుకోబోతున్నాడని టాలీవుడ్ టాక్. ఇదే కనుక నిజమైతే ఖచ్చితంగా అఖిల్ తీసుకున్నది డేరింగ్ నిర్ణయమే అవుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ కూడా చాలా వేగంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ షూటింగ్ ను ఎలాగైనా పూర్తి చేసి వీలైనంత తొందరగా కొబ్బరికాయ కొట్టేయాలని చూస్తున్నాడు. చూద్దాం.. ఈసారైనా అఖిల్ సక్సెస్ సాధిస్తాడో లేదో తెలియాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here