కరోనా మహమ్మారిని కట్టడి చేయాలని కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపధ్యంలో టాలీవుడ్ సినీ కార్మికుల కష్టాలను చూసిన సినీ ప్ర‌ముఖులు కూడా త‌మ వంతు సాయం అందించారు. అలాగే టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నుండి సినీ తారలు కోట్లాది రూపాయలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ నిధికి విరాళాలుగా అందించారు. సామాన్య ప్రజల కూడా తమవంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చి ఎందరో పేదలకు సాయం చేసారు. అయితే పేదలను ఆదుకునేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ రైతులను ఆదుకునే నాధుడే కరువయ్యాడు. వాళ్ళకు మాత్రం అంతంత మాత్రంగానే సాయం అందుతుంది. అందుకే బ్లూక్రాస్ సోసైటీ హైద‌రాబాద్ కో ఫౌండ‌ర్ అమ‌ల అక్కినేని రైతుల‌కు అండ‌గా నిల‌బ‌డి త‌న స‌హృద‌యాన్ని మరోసారి చాటుకున్నారు.

రంగారెడ్డి జిల్లా కేశం పేట మండ‌టం పాపిరెడ్డి గూడ‌లో స‌ర్పంచి విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో 650 మంది రైతుల‌కు అమ‌ల అక్కినేని ఉచితంగా కంది విత్త‌నాల‌ను పంపిణీ చేశారు. ఒక్కొక్క రైతుకు 4 కిలోల కంది విత్త‌నాల‌ను పంపిణీ చేశారు. అంతేకాదు సేంద్రీయ ప‌ద్ధ‌తుల్లో వ్య‌వసాయం చేయ‌డానికి రైతులు ముందుకు వ‌స్తే నిపుణుల‌ను పిలిపించి ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో రైతుల‌కు సూచిస్తామ‌ని అమ‌ల తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా క‌రోనా వైర‌స్ సోక‌కుండా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో కూడా ఆమె సూచనలను అందించారు.

“కిరాయి దాదా” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై.. “శివ” సినిమాతో సెన్సేషన్ సృష్టించి.. ఆ తర్వాత నాగార్జనను ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమల పెళ్లికి ముందు ఎన్నో సినిమాల్లో నటించినా, పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పి టాలీవుడ్ కు దూరమైంది. 1992లో ‘కార్పూరా ముల్లై’ అమల నటించిన చివరి సినిమా. ఆ తర్వాత 2012లో విడుదలైన “లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌” చిత్రంతో మళ్ళీ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన అమల ప్రస్తుతం శర్వానంద్‌ హీరోగా తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కబోతున్న సినిమాలో శర్వానంద్‌ కు తల్లిగా నటిస్తుంది. మొత్తానికి అక్కినేని అమల చేస్తున్న సేవలను చూస్తుంటే ఈవిడగారు “టాలీవుడ్ మదర్ ధెరీసా” అనిపిస్తుంది కదూ..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here