గంగోత్రి సినిమా గుర్తుందా? అల్లు అర్జున్ తెలుగు తెరకు పరిచయం అయినా సినిమా గంగోత్రి. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకుగా పరిచయమై.. మెగా హీరోలలో ఒకడిగా మన ముందుకు వచ్చాడు అల్లు అర్జున్. కానీ ఆ సినిమా చుసిన తరువాత చాలా మంది ఇతను హీరో ఏంటి.. అని అనుకున్నారు. కొందరు మనసులో అనుకుంటే మరికొందరు బాహాటంగానే అనుకున్నది బయటపెట్టారు. అయితే గంగోత్రి సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవడానికి కారణం దర్శకుడు కె.రాఘవేంద్రరావు.

అయితే ఆ హిట్ ఇచ్చిన బూస్ట్ తో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు అల్లు అర్జున్… అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని తనకు అనుగుణంగా మలచుకున్నాడు. ఒక్కో సినిమాకు తన లుక్ లో, తన మ్యానరిజం లో కొత్తదనం చూపిస్తూ కష్టపడి స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు బన్నీ. నిజం చెప్పాలి అంటే బన్నీ తన రెండో సినిమా “ఆర్య” తోనే తన లుక్ లో భారీ చేంజ్ చూపించాడు.. అప్పటివరకు గంగోత్రి సినిమాలో ప్రేక్షకులు ఆర్య సినిమాలో అల్లు అర్జున్ చూసి షాక్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇతనేనా గంగోత్రి సినిమాలో నటించింది అని షాక్ అయిన వారు ఉన్నారు.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన “ఆర్య” సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో బన్నీ కుర్రకారుకు బాగా నచ్చేసాడు. ఆ తరువాత వచ్చిన “బన్నీ”, “హ్యాపీ” సినిమాలతో తన స్టైల్ ను అందరికి అలవాటు చేసాడు. అప్పుడే వచ్చింది “దేశముదురు” పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమాతో మాస్ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు అల్లు అర్జున్. ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటుగా అల్లు అర్జున్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. తాను అనుకున్న పాత్రకోసం ఎంత కష్టమైన పడతాడు బన్నీ.

మెగా ప్రొడ్యూసర్ తనయుడిగా అంత కష్టపడాల్సిన పనేముంది ఈజీగానే స్టార్ డమ్ వచ్చి ఉంటుంది అనుకునేవారు ఉన్నారు. కానీ ప్రతి సినిమా కథ ఎంచుకునే దగ్గర నుండి తన లుక్స్, యాక్షన్, డాన్స్, మ్యూజిక్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉండేలా జాగ్రత్త పడతాడు అల్లు అర్జున్. నటుడిగా సినిమా సినిమాకు పరిణితి చెందుతూ వస్తున్నాడు. అయితే “రుద్రమదేవి” చిత్రంలో బన్నీ నటించిన పాత్ర “గోనగన్నారెడ్డి”. ఆ పాత్రకు అర్జున్ నటన వల్లే సూపర్ క్రేజ్ వచ్చింది అనేది సత్యం. ఈ పాత్ర ఆ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అయిందనే చెప్పాలి.

అప్పుడెప్పుడో వచ్చిన “గంగోత్రి” నుండి నిన్న వచ్చిన “అలా వైకుంఠపురములో” అల్లు అర్జున్ లో భారీ చేంజ్ ఏ కనిపిస్తుంది. ఆలా వైకుంఠపురములో బంటు పాత్రలో అతడి నటన అందరిని మెప్పించింది. గంగోత్రి సినిమా వచ్చిన సమయంలో అసలు ఇతడు హీరో ఏంటో.. అనుకున్న వారు కూడా ఇప్పుడు హీరో అంటే ఇతడే అని అనిపించుకునే స్థాయికి చేరుకుకున్నాడు అల్లు అర్జున్. నీ సంకల్పం గట్టిదైతే, నీలో కష్టపడే తత్త్వం ఉంటే ఎప్పటికైనా శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుందని బన్నీ మరోసారి ప్రూవ్ చేసాడు. ఈరోజు అయన పుట్టిన రోజు సందర్భంగా తెలుగుడెస్క్ టీమ్ తరుపున స్పెషల్ బర్త్ డే విషెస్ అందిస్తున్నాము. “Happy Birth Day Allu Arjun”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here