బుల్లితెరపై అదరగొడుతున్న “ఆనందం” హీరో !!

0
273

అద్వితీయమైన ప్రేమ కధాంశంతో విడుదలై అసాధారణ విజయం సాధించిన ‘ఆనందం’ చిత్రంతో అదరగొట్టే ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అందాల హీరో ఆకాష్.. ఆ తర్వాత ‘వసంతం, అందాల రాముడు, గోరింటాకు, నమో వేంకటేశ’ మొదలైన చిత్రాలలో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. సినిమాల పరంగా ఈమధ్య తన కెరీర్ గ్రాఫ్ కాస్త తగ్గినా ఆకాష్ ఇప్పుడు గోడకు కొట్టిన బంతిలాగ రెట్టించిన ఉత్సాహంతో గత వైభవాన్ని సంపాదించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈమధ్య కాలంలో ఆకాష్ కన్నడ బుల్లితెరపై నటించిన ‘జోతాయి.. జోతాయల్లీ’ సీరియల్ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇదే సీరియల్ తమిళంలో.. ‘నీతానై ఎంతన్ పొన్వసంతన్’ పేరుతో జీ-తమిళ్ లో డైలీ సీరియల్ గా ప్రసారమౌతుండటంతో తమిళ రంగంలో కూడా ఆకాష్ పేరు మారు మ్రోగిపోతుంది. తాజాగా ‘ఏ-క్యూబ్’ పేరుతో ఒక మూవీ యాప్ ను కూడా సిద్ధం చేసుకున్న ఆకాష్ ‘అందాల రాక్షసుడు’గా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమౌతున్నాడు. అదండి సంగతి.. మొత్తానికి వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా అదరగొట్టేస్తున్న ఆకాష్ ను చూస్తుంటే ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే సంపాదించుకోవాలనే పాత సామెత గుర్తొస్తుంది కదూ.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here