ఓంకార్.. ‘ఆట’ షోతో డ్యాన్స్ ప్రోగ్రామ్స్‌కి తన మార్క్ యాంకరింగ్ తో ఊపు తెచ్చిన ఓంకార్, ముఖంలో ఏ విధమైన హావభావలు కనపడకుండా యాంకరింగ్ చేస్తాడని విమర్శలు వచ్చినా… అదే తన స్టైల్‌ యాంకరింగా మార్చుకుని తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్‌గా కొనసాగుతున్నాడు. బుల్లితెరమీదే కాదు, టాలీవుడ్ లో కూడా తన సత్తా చూపించాడు. డైరెక్టర్ గా ‘జీనియస్‌’, ‘రాజుగారి గది’, ‘రాజుగారి గది2’, ‘రాజు గారి గది 3’ సినిమాలతో తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ జోడీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు ఓంకార్. అయితే తాజగా ఆయనకు కరోనా సోకినట్టుగా తెలుస్తోంది.

లాక్‌డౌన్ తర్వాత కొన్ని ఎపిసోడ్లు షూటింగ్ జరుపుకున్న ఈ కార్యక్రమం… ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఏమి జరిగిందా అని ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేసుకొగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓంకార్‌కి కరోనా పాజిటివ్ రావడంతో ఆ షోలో పాల్గొన్న పార్టిసిపెంట్స్, టెక్నిషియన్స్, మిగతా సభ్యులు కంగారు పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నటుడు బండ్ల గణేశ్ కరోనా బారిన పడగా టీవీ నటుడు ప్రభాకర్‌కు కూడా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఓంకార్ కూడా ఆ లిస్టులో చేరాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here