టాలీవుడ్ సినీ ఆర్టిస్ట్ సాయిసుధ, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడు కేసు రోజురోజుకు ముదురుతున్నట్టుగానే ఉంది. తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ సినీ కెమెరామెన్ ఛోటా.కె. నాయుడు తమ్ముడు, శ్యామ్.కె.నాయుడు తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ సినీ ఆర్టిస్ట్ సాయి సుధ S.R నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు శ్యామ్ కే నాయుడు ను అరెస్ట్ చేసి , రిమాండ్ కి తరలించిన తర్వాత తనపై కంప్లైంట్ ఇచ్చిన బాధితురాలు సాయి సుధ సంతకాన్ని మార్ఫింగ్ చేసి, కాంప్రమైజ్ అయినట్టుగా బెయిల్ పిటిషన్ వేశారు శ్యామ్ కె. నాయుడు.

ఆ పిటిషన్ ను పరిశీలించిన నాంపల్లి కోర్ట్ శ్యామ్ కే నాయుడు కు బెయిల్ మంజూరు చేసింది. దాంతో రిమాండ్ కి వెళ్లిన 2 రోజుల్లోనే బెయిల్ పై బయటికొచ్చారు శ్యామ్ కే నాయుడు. విషయం తెలుసుకున్న సాయి సుధా బెయిల్ పిటిషన్ సవాల్ చేస్తూ తన సంతకాన్నే ఫోర్జరీ చేసి దొంగ సంతకం పెట్టి, బెయిల్ కు తాను ఒప్పుకున్నట్లు పత్రాన్ని సృష్టియించారంటూ మరోసారి కోర్ట్ ను ఆశ్రయించింది. దీంతో శ్యామ్ కె. నాయుడు కధ అడ్డం తిరిగింది. కేసును విచారణ చేసిన నాంపల్లి కోర్టు బెయిల్ ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here