కరోనా సృష్టిస్తున్న సంక్షోభానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిసితి మరింత దారుణంగా తయారవుతుంది. ఆర్ధిక సంవత్సరం మొదట్లోనే కరోనా కారణంగా భారీ దెబ్బ పడింది. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం ఘననీయంగా పడిపోయింది. రిజిస్ట్రేషన్లు, ఎక్సయిజ్ వంటి రంగాలనుండి చిల్లిగవ్వ కూడా పుట్టడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ధిక కార్యకలాపాలు అన్ని స్తంభించాయి. మరో వైపు వేతనాలు, పింఛన్లు, ఆసరా తోపాటుగా పలు కీలక పధకాల అమలు కోసం దాదాపు 10వేల కోట్లు అవసరం అవుతాయి.

దీనితో కేంద్రపన్నుల వాటా మరియు రుణాలు సహా ఇతర మార్గాల నుంచి నిధులను సమీకరించడం కోసం ఆంద్రప్రదేశ్ ఆర్ధిక శాఖ ద్రుష్టి పెట్టింది. అయితే గత ఏడాదే 77 వేల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ప్రస్తుత పరిసితిని దృష్టిలో పెట్టుకుని మంగళవారం నాడు మరో రూ.1000 కోట్ల రుణాన్ని తీసుకుంది. సెక్యూరిటీల వేలం కోసం ప్రయత్నించగా రిజర్వ్ బ్యాంకు నుంచి 11 ఏళ్ల కాలానికి 7.98 శాతం వడ్డీ కింద రూ.1000 కోట్లు అప్పుగా తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here