బాహుబలి రికార్డ్ బద్దలు కొట్టిన అమీర్ ఖాన్ దంగల్…

0
241

అమీర్ ఖాన్ అన్నంత పని చేసాడు. చెప్పినట్టుగానే బాహుబలి రికార్డ్ బద్దలు కొట్టాడు.. అంతర్జాతీయ స్థాయిలో భారీ కలెక్షన్ లతో దూసుకుపోతున్న రెండు ఇండియన్ చిత్రాలు బాహుబలి, దంగల్. ఈ రెండు చిత్రాలు భారీ కలెక్షన్ లు వసూలు చేయిస్తూ అంతర్జాతీయ చిత్రాలకు సవాల్ విసురుతున్నాయి. అయితే నిన్న మొన్నటి వరకు మన జక్కన్న రాజమౌళి చెక్కిన బాహుబలి 2 చిత్రం 1600 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా, ఇప్పుడు దాన్ని వెనక్కి నెట్టి అమీర్ ఖాన్ దంగల్ చిత్రం మొదటి స్థానాన్ని ఆక్రమించింది.

దీనితో దంగల్ చిత్రం అత్యధిక కలెక్షన్లు సాధించిన తోలి చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఇండియాతో పాటు పలు దేశాలలో విడుదలైన ఈ చిత్రం సుమారు 700 కోట్లు రాబట్టగా, కేవలం చైనాలోనే 1100 కోట్ల మార్కును అందుకుంది. మొత్తంగా దంగల్ చిత్రానికి ఇప్పటి వరకు 1800 కోట్లు వచ్చాయి. మరో విశేషం ఏంటి అంటే ఇప్పటివరకు ఈ హాలీవుడ్ చిత్రం కూడా సాధించలేని ఈ మార్క్ ని సాధించింది మన దంగల్. చైనా లో 1000 కోట్లు సాధించిన తోలి విదేశి చిత్రంగా సెన్సేషన్ సృష్టించింది. ఇదిలా ఉండగా బాహుబలి 2 చిత్రం కూడా త్వరలో చైనాలో విడుదల కానుండగా, మరి రాజమౌళి బాహుబలి ప్రభంజనం ఎలా వుంటుందో మరి కొద్దిరాజులు వేచిచూడాల్సిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here