బనానా ఇడ్లీ ఎలా తయారుచేయాలో చూద్దాం… హెల్తీ బ్రేక్ ఫాస్ట్…

కావల్సిన పదార్థాలు:
రవ్వ: 1 cup
కొబ్బరి తురుము: 1/4 cup
పండిన అరటి పండ్లు: 3-4 (గుజ్జుగా చేయాలి)
ఉప్పు: ఒక చిటికెడు
చక్కెర / బ్రౌన్ షుగర్ / బెల్లం: 1/2cup(లేదా రుచికి సరిపడా)
బేకింగ్ సోడా: 1/2tsp
నెయ్యి: 1tsp

తయారు చేయు విధానం:

1. ముందుగా బాగా పండిన అరటి పండ్లను మెత్తగా చిదిమి పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక బౌల్లో చిదిమి పెట్టుకొన్న అరటిపండు గుజ్జు, రవ్వ, కొబ్బరి తురుము, ఉప్పు, పంచదార మరియు బేకింగ్ సోడా, అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి.
3. ఈ మిశ్రమంలో కొద్దిగా నీళ్ళు కలపి మిక్స్ చేయడం వల్ల ఇడ్లీ పిండి తయారవుతుంది.
4. తర్వాత ఇడ్లీ ప్లేట్ కు నెయ్యి రాసి, ఇడ్లీ పిండి పోసి, ఇడ్లీకుక్కర్ లో పెట్టి, 15నిముషాల పాటు మీడియం మంట పెట్టి, ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంతే, వడ్డించడానికి బనానా ఇడ్లీ రెడీ. ఇది ఒక మార్నింగ్ బెస్ట్ స్వీట్ ట్రీట్, పాలతో కలిపి తీసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here