Connect with us

Featured

సుశాంత్ – దిశల కేసులో ఊహించని ట్విస్ట్ ! (వెలుగులోకి వచ్చిన సల్మాన్, సూరజ్ పంచోలి పేర్లు)

Published

on

బాలీవుడ్ ధోనీ గా యువతరం గుండెల్లో మంచి స్ధానాన్ని సంపాదించుకున్న యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఊహించని మరణంతో బాలీవుడ్ ఇండ్రస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సుశాంత్ మరణం అతడి అభిమానులను కంటతడి పెట్టిస్తోంది.

ఇదిలావుండగా సుశాంత్ మరణించిన 4రోజుల ముందే సుశాంత్ దగ్గర మేనేజర్‌గా పనిచేసిన దిశా సెలైన్ కూడా బలవాన్మరణం పొందటంతో వీళ్ళిద్దరి సంఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. ముంబైలోని మలాడ్‌లో ఓ అపార్ట్‌ మెంట్‌లో నివసిస్తున్న దిశ సెలైన్ జూన్ 10వ తేదీన ఆ అపార్ట్ మెంట్ 14వ అంతస్తు నుంచి దూకడంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆమెను బోరివాలి ఆసుపత్రికి తరలించారు. దిశను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లుగా ధ్రువీకరించారు. ఈ ఘటన జరిగి ఇన్నిరోజులవుతున్నా దిశ మరణానికి గల కారణాలు ఇంతవరకూ వెలుగులోకి రాలేదు. పీఆర్‌గా తన కెరీర్‌ ప్రారంభించిన దిశ గతంలో ఐశ్వర్య రాయ్, కమెడియన్ భారతీ శర్మ, హీరోయిన్ రియా చక్రవర్తిల దగ్గర మేనేజర్‌గా పని చేసింది. దిశ మరణించే సమయానికి వరుణ్ శర్మ దగ్గర మేనేజర్‌ గా పనిచేసింది.

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. దిశ మరణించిన 4 రోజులకే సుశాంత్ కూడా బలవాన్మరణం పొందటంతో వీళ్ళిద్దరి కేసులు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కేసులను ఇన్వెస్ట్ గేషన్ చేస్తున్న పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా ఈమధ్య సోషల్ మీడియాలో బాలీవుడ్ ప్రముఖులపై నెపోటిజం ఆరోపణలు వచ్చిన ఆంశాలను దృష్టిలో పెట్టుకుని సుశాంత్ ఫ్రెండ్స్.. ఫ్యామిలీ మెంబర్స్.. అలాగే బాలీవుడ్ సెలెబ్రిటీలందర్నీ విచారిస్తున్నారు. ఈ విచారణలో ఈ కేసుకు సంబంధించి తాజాగా సల్మాన్‌ ఖాన్‌, సూరజ్ పంచోలీ పేర్లు వెలుగులోకి వచ్చాయి.

సుశాంత్ బతికున్పప్పుడు సూరజ్ విషయంలో సల్మాన్‌, సుశాంత్ ని బెదిరించాడని.. ఆ తర్వాతే బాలీవుడ్ లోని కొన్ని నిర్మాణ సంస్థలు సుశాంత్‌ని దూరం పెట్టాయనే రూమర్స్ మీడియాలో షికారు చేశాయి. ఇక అసలు విషయానికొస్తే.. సుశాంత్‌ కి, సూరజ్‌కి ఎక్కడ గ్యాప్‌ వచ్చిందన్న ప్రధానమైన పాయింట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో దిశ చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సుశాంత్‌ ఆమెకు తోడుగా నిలబడ్డాడని, అందుకనే సూరజ్‌తో సుశాంత్ గొడవ పడినట్లు సమాచారం. ఇది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న అంశమేమిటంటే.. సూరజ్‌, దిశ ఇద్దరూ డేటింగ్ లో ఉండగా.. దిశ గర్భవతైంది. అయితే దిశ తన గర్భాన్ని తొలగించుకోవాలని సూరజ్‌ చెప్పడంతో.. దిశ అందుకు ఒప్పుకోలేదు. ఇద్దరిమధ్యా ఘర్షణ జరిగింది. ఈ విషయంలో దిశకు సుశాంత్‌ అండగా నిలిచాడు. ఈ సంగతి తెలిసుకున్న సల్మాన్‌, సూరజ్‌కి దూరంగా వుండాలంటూ సుశాంత్‌ ని బెదిరించాడు.

ఈ సంగతులన్నీ సుశాంత్.. రియాకు, తన ఫ్రెండ్ సందీప్‌కి చెప్పినప్పుడు నోరు మూసుకొని ఉండమని వాళ్ళందరూ కూడా సుశాంత్ నే హెచ్చరించారట. ఊహించని మలుపులు తిరుగుతున్న ఈ క్రైమ్‌ కధలో సందీప్‌కి కూడా భాగం ఉందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి. చూద్దాం.. సుశాంత్‌ – దిశల కేసు భవిష్యత్ లో మరెన్ని మలుపులు తిరుగుతుందో.. ఈ కేసులో ఇంకెన్ని ఊహించని ట్విస్ట్ లున్నాయో.?

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!