సీఎం జగన్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్ర విమర్శలు చేసారు.. జగన్ భారత దేశం దాటి వెళితే అరెస్ట్ అవుతారని, ఆ భయంతోనే జగన్ దేశం విడిచి వెళ్ళడానికి భయపడుతున్నారని వ్యాఖానించారు. అన్ని దేశాల కంటే అరబ్ దేశాల చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని, అందుకే దుబాయ్ పెట్టుబడుల సదస్సుకు జగన్ వెళ్ళడానికి నిరాకరించారని అన్నారు బోండా ఉమ. అయితే సౌదీ చట్టాలకు బయట పడే దుబాయ్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ తరపున ఎవరు వెళ్లలేదని ఎద్దేవ చేసారు. గతంలో వాన్ పిక్ కోసం రస్ ఆల్ ఖైమా నుండి నిమ్మగడ్డ ప్రసాద్ 845 కోట్లు తీసుకున్నారు. అయితే అవి తిరిగి చెల్లించకపోవడంతో రస్ ఆల్ ఖైమా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే సీఎం జగన్ తో పాటు మిగిలిన ముద్దయిలను కూడా తమకు అప్పగించాలని ఆ దేశం మన ప్రధాని మోడీని కోరిందని చెప్పారు. అయితే కేంద్రం ఆయా దేశాల ఒత్తిడికి ఆలోచనలో పడిందని చెప్పారు.

ఇక నిమ్మగడ్డ అయన జీవితం మొత్తం సెర్బియా జైలులో గడపాల్సిందే అని జోస్యం చెప్పారు. జగన్ తో పాటు మిగిలిన 13 మంది నిందితులు కూడా దేశం దాటి వెళ్తే అరెస్ట్ అవ్వడం ఖాయం అని చెప్పుకొచ్చారు. సౌదీ చట్టాలకు చాలా కఠినంగా ఉంటాయని అక్కడ అయితే కనీసం బయటకి వచ్చే అవకాశం కూడా ఉండదని అదే భయంతో జగన్ దేశం వదిలి వెళ్ళడానికి భయ పడుతున్నాడని తీవ్ర విమర్శలు చేసారు మాజీ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here