ఇటీవల భారత్, చైనా సరిహద్దులలో జరిగిన యుద్ధంలో 20 మంది భారత జవానులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చైనా ప్రొడక్ట్స్ ను బహిష్కరించాలనే డిమాండ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, ఆమిర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, విరాట్ కోహ్లీ మొదలైన ఇండియన్ సెలెబ్రీటీలు చైనా ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తున్నారని, వెంటనే ఆ ప్రకటనలకు సంబంధించిన అగ్రిమెంట్లను వాళ్ళందరూ క్యాన్సిల్ చేసుకోవాలని C.A.I.T డిమాండ్ చేసింది. చైనా, భారత్ ల మధ్య నిత్యం ఏదో ఒక సమస్య క్రియేట్ అవుతూనే ఉంది. భారత్, చైనాల సరిహద్దుల వెంట చైనా ఎప్పుడూ సమరానికి సై అంటూనే ఉంటుంది. అయితే చైనాను ఎదిరించడానికి భారతీయుల చేతిలో 2 ఆయుధాలున్నాయని కొందరు C.A.I.T సభ్యులు తెలిపారు.

  1. ఆర్మీ యుద్దం. భారత ఆర్మీ చైనాతో యుద్దం చేయాలి.
  2. చైనా ప్రోడక్ట్స్ ను భారతీయులు పూర్తిగా తిరస్కరించాలి. మనం వారి వస్తువులను కొంటున్నాం, ఆర్థికంగా సహకరిస్తున్నాం. వాటితో చైనా వాళ్ళు ఆయధాలు కొంటున్నారు, వారికొచ్చే ఆదాయాన్ని ఆర్మీపై ఖర్చు పెడుతున్నారు. అంటే మన సంపదతో మన మీదనే దాడి చేస్తున్నారు. అందుకే వారి ఉత్పత్తులను బహిష్కరించాలని C.A.I.T బృందం సూచిస్తుంది. ఒకవైపు మన సైనికులు చైనా సరిహద్దుల్లో చనిపోతుంటే.. మరోవైపు మన సినీ ప్రముఖులు చైనా ప్రోడక్ట్స్ ను ప్రమోట్ చేస్తున్నారని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (C.A.I.T) మండిపడింది. బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు చైనా ఉత్పత్తులను ఎండార్స్ చేయడం వెంటనే అపెయ్యాలని లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవల్సి వస్తుందంటూ C.A.I.T బాలీవుడ్ సెలెబ్రీటీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మరి మన బాలీవుడ్ ప్రముఖులు ఇప్పటికైనా తమ దేశభక్తిని ప్రదర్శిస్తారో.. లేక ధనం వైపే మొగ్గు చూపుతారో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here