బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి.. ఈ పేరు గత కొన్ని నెలలుగా నందికొట్కూరు నియోజకవర్గం లో హాట్ టాపిక్.. తాత వారసత్వం పెదనాన్న రాజకీయం ఒంట పట్టించుకోని 19 ఏళ్లకే రాజకీయ రంగప్రవేశం చేసాడు. అడుగడుగునా కరుడుగట్టిన కుయుక్తులతో నలుదిక్కుల పెను సవాళ్లు విసురుతున్న సొంత పెదనాన్న చిన్న పిల్లకాయ అంటూ తీసి పారేసిన తన పార్టీలోనుండి అధికారం కోసం కుట్రలు పన్నుతున్న జనం మాత్రం సిద్దార్థవెంటనే ఉన్నారు ..ఈ విషయం ఇప్పుడు జగన్ కి కూడా తెలిసింది. అందుకే నందికొట్కూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆర్థర్ ఉన్నప్పటికీ పార్టీ పగ్గాలు పాలనా వ్యవహారాలు సిద్ధార్థ చేతిలోనే పెట్టాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

నిన్న మొన్నటి వరకు టీడీపీ పార్టీ తోనే సిద్ధార్థకు గొడవలు అనుకున్నప్పటికీ, నియోజకవర్గంలో పట్టుకోసం సొంత పార్టీ ఎమ్మెల్యే ఆర్థర్ సిద్ధార్థరెడ్డి పై పోరు ప్రారంభించాడు. ఒకే పార్టీ లో ఉన్న ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారయ్యింది. ఒక అధికారి బదిలీ దగ్గర మొదలైన గొడవ చిలికి చిలికి ఎక్కడి వరకు వెళ్ళింది అంటే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఇద్దరి మధ్య గొడవలు లేవు అని నిరూపించాల్సి వచ్చింది. కానీ పరిస్థితి చేయిజారిపోకముందే బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మేల్కొన్నాడు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదు అలాగే భవిష్యత్తులో ఆర్థర్ కి కళ్లెం వేయాలంటే ఏం చేయాలో అది చేసి చూపించాడు.

ప్రస్తుతం బైరెడ్డి కేవలం నందికొట్కూరు వైసీపీ పార్టీ ఇంచార్జిగా మాత్రమే వ్యవహరిస్తున్నారు. ఒక్క ఎస్సీ నియోజకవర్గం కాబట్టే ఎమ్మెల్యే సీట్ ఆర్థర్ కి వెళ్ళింది అనే విషయం అందరికి తెలిసిందే. అందుకే తన మాట జవదాటని ఎస్సీ కాండిడేట్స్ ని నందికొట్కూరు లో రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా దింపడం ప్రారంభించాడు బైరెడ్డి. ప్రణాళికలో భాగంగా మొదట టీడీపీ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే ఐజయ్యను వైసీపీ పార్టీలో చేర్చుకోవడంతో కేవలం ఆధిపత్యం కోసం ఆర్థర్ వేసిన ప్రణాళికలు ఫలించగా పోగా వచ్చే ఎన్నికల్లో తన సీట్ కె ఎసరు పెట్టిన విషయం అర్ధం అయినట్టు ఉంది.

టెక్నీకల్ గా ఎమ్మెల్యే ఆర్థర్ అయినప్పటికీ సిద్దార్థ రెడ్డి చేతికే అన్ని బాధ్యతలు ఇచ్చినట్టు అర్ధం అయ్యింది. అంతే కాదు వైస్ జగన్ సొంత సామజిక వర్గానికి చెందిన వాడు కావడం తో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి పూర్తి సపోర్ట్ దొరికింది. ఇక ఐజయ్య ఎంట్రీ తో కస్సుబుస్సు మన్న ఆర్థర్ ఇప్పుడు నందికొట్కూరు కి సంబంధించి కేవలం నెంబర్ 2 గానే ఉండాల్సిన పరిస్థితి. ఇక సర్దుకుపోవడం తప్ప మరొక దారి లేదు. తోక జాడిస్తే కట్ చేయడానికి అటు బైరెడ్డి ఇటు జగన్ రెడ్డి సిద్ధంగా ఉండటం తో వానపాము మాదిరి తయారయ్యింది ఆర్థర్ పరిస్థితి. కానీ ఈ పరిస్థితి కొంత వైసీపీ పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదు. ఆర్థర్ అనుచరులు కూడా అవకాశం కోసం వేచి చూస్తున్నారు. ఇవేమి పట్టించుకోకుండా జగన్ సపోర్ట్ దొరకడంతో బైరెడ్డి సైతం స్థానిక ఎన్నికల్లో తన దూకుడు పెంచి పార్టీ ని గెలిపించే పనిలో ఉన్నారు.

మరో వైపు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూతురు శబరీ సైతం బీజేపీ పార్టీ నుండి సొంత తమ్ముడివైపు బాణం లా దూసుకస్తుంది. ప్రస్తుతానికి అయితే బైరెడ్డి సిద్దతరెడ్డి కి గట్టిగా గాలి వీస్తుంది మరి అయన సత్తా స్థానిక ఎన్నికల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఏది ఏమైనా నియోజకవర్గ ప్రజలు మాత్రం వీడు అస్సలు సిస్సలైన మొగాడు అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here