స్పైసీ అండ్ టేస్టీ చికెన్ మకరోని సలాడ్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…

 కావల్సిన పదార్థాలు:

చికెన్ బ్రెస్ట్ – 250 grms (చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించాలి)
మకరోని – 400grms
క్యారట్లు – 1cup
ఉల్లిపాయలు – 1cup
రెడ్ కాప్సికం – 1cup
అల్లం & వెల్లుల్లి పేస్ట్ – 1tsp
క్యాబేజీ – 1cup
పచ్చిమిర్చి – 5 -6
మయోన్నైస్ – 2tsp
పెప్పర్ పౌడర్ – 1/2tsp
ఉప్పు : రుచికి తగినంత ఆలివ్ నూనె: కొద్దిగా

తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్ తీసుకొని అందులో కొదిగా నీళ్ళు పోయాలి. తర్వాత అందులో మకరోని వేసి 15 నిముషాలు ఉడికించుకోవాలి.

2. మకరోనీ సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత, హాట్ వాటర్ వంపేసి అందులో కొద్దిగా చల్లటి నీరు పోయాలి. 5నిముషాల తర్వాత చల్లటి నీరు కూడా పూర్తిగా వంపేసి పక్కన పెట్టుకోవాలి.

3. తర్వాత పాన్ స్టౌ మీద పెట్టి అందులో ఆలివ్ ఆయిల్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్, రెడ్ క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాబేజ్ మరియు పచ్చిమిర్చి వేయాలి. మీడియం మంట మీద వీటన్నింటిని వేగించుకోవాలి.

4. తర్వాత ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకొన్న మకరోనీ వేసి, కొద్దిగా ఉప్ప వేసి మొత్తం మిశ్రమం కలగలుపుకుంటూ ప్రై చేయాలి.

5. తర్వాత ముందుగా కట్ చేసి, ఉడికించి పెట్టుకొన్న చికెన్ కూడా వేసి ఫ్రై చేయాలి. చివరగా మయోన్నైస్ మరియు పెప్పర్ పౌడర్ వేసి మిక్స్ చేయాలి. మొత్తం పదార్థాలన్ని మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అంతే మకరోని చికెన్ సలాడ్ రెడీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here