దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రమే కరోనా పరీక్షలు ఉచితంగా జరుగుతున్న విషయం తెలిసిందే… అయితే ప్రస్తుతం కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని ప్రైవేటు ల్యాబ్ లకు కూడా కరోనా పరీక్షలు చేయడానికి అనుమతులిచ్చింది. అది కూడా కేవలం గుర్తించిన ప్రైవేట్ ల్యాబ్ లలో మాత్రమే జరుగుతున్నాయి. తాజగా ప్రభుత్వ మరియు ప్రైవేటు ల్యాబ్ లలో ఉచితంగా కోవిడ్ -19 పరీక్షలు చేయాలనీ స్పష్టం చేసింది. దీనికి సంబందించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

కరోనా నిర్దారణ పరీక్షలకు 4,500 రూపాయిలు ఖర్చు అవుతుందని పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ కి చెందిన ఒక వ్యక్తి వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలో ధర్మాసనం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితిలో పరీక్ష ఫీజులు ప్రజలకు భారం కాకూడదనే ఉచితంగా నిర్వహించేలా రాష్ట్రాలకు కూడా తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.

కాగా దేశంలో ఇప్పటికె కరోనా బాధితుల సంఖ్య 5 వేలకు దాటింది. 149 మందికి పైగా మృతి చెందారు. దేశంలో కరోనా కేసులు క్రమేపి పెరుగుతన్న నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ ను మరికొంత కాలం పొడిగించనున్నట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here