పిల్లల్లో అలాంటి సమస్యలను తెస్తున్న కరోనా వైరస్..?

0
93

గత ఏడాది మొదటి దశ వ్యాప్తి చెందినప్పుడు వైరస్ ప్రభావం వృద్ధులపై అధిక తీవ్రతను చూపించింది. ఈ క్రమంలోనే మొదటిదశ వైరస్ వ్యాధి చెందినప్పుడు ఎంతో మంది వృద్ధులు మృతి చెందారు. ప్రస్తుతం కొనసాగుతున్న రెండవ దశ ఎక్కువగా యువతపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రెండవ దశ పూర్తి కాకుండానే థర్డ్ వేవ్ గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు.

థర్డ్ వేవ్ త్వరలోనే రాబోతుందని,దీని ప్రభావం చిన్న పిల్లలపై ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరించడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఈ క్రమంలోనే తల్లిదండ్రులు చిన్నారుల పట్ల కఠినంగా ప్రవర్తించే వారిని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల కఠినమైన ఆంక్షలతో పిల్లలపై అధిక ఒత్తిడి కలిగి పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులు, తల్లిదండ్రుల ఆంక్షలు పిల్లలపై తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయని, ఈ క్రమంలోనే పిల్లల మానసిక రుగ్మతలకు లోనవుతున్నారని తెలిపారు. పిల్లలకు తెలియజేసే ప్రతి చిన్న విషయానికీ తీవ్రంగా స్పందించడం, తల్లిదండ్రులపై ద్వేషం పెంచుకోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.

ఈ సమస్యలపై సైకాలజిస్ట్ సత్యకాంత్ త్రివేది అనేక విషయాలను వివరించారు. ‘‘తాజా పరిస్థితుల వల్ల పిల్లల్లో వస్తున్న మానసిక మార్పులు తల్లిదండ్రులకు సమస్యే. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ముందుగా పిల్లలను అర్థం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here