నేడు హుజూరాబాద్‌‌కు కేసీఆర్.. 15 మందికి దళిత బంధు

0
1568

నేడు హుజూరాబాద్ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. . హుజూరాబాద్‌ మండలంలోని శాలపల్లిలో బహిరంగా సభలో పాల్గోననున్నారు. ఇందుకోసం సభా ప్రాంగణం ముస్తాబైంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి శాలపల్లికి చేరుకుంటారు. అక్కడి రోడ్డు మార్గంలో సభాస్థలికి వస్తారు. ఈ వేదికపై నుంచే దళిత బంధు పథకాన్ని అధికారికంగా శ్రీకారం చూట్టనున్నారు.

దళితబంధు సభకు లక్షా 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వేదికపై నుంచి ఎంపికైన 15 మంది దళిత కుటుంబాలకు దళిత బంధు అందించనున్నారు. అధికారులు వీరి వివరాలు వెల్లడించలేదు. జర్మన్‌ హంగర్‌ టెక్నాలజీతో సభ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. గాలులు, భారీవర్షం పడినప్పటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here