“తన త‌మ్ముడు వ‌ల్ల ప్రాణ‌హాని ఉంద‌ంటూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన దాసరి నారాయణరావు పెద్ద కొడుకు” అవును. మీరు చదివింది అక్షరాల నిజమే.. ద‌ర్శ‌క దిగ్గ‌జం డాక్ట‌ర్ దాస‌రి నారాయ‌ణ‌రావు గారు మరణించిన తర్వాత ఆ ఇంట్లో ఏం జరుగుతోంది.? దాసరి గారి ఇద్దరి కొడుకుల మ‌ధ్య ఆస్తి వివాదం ఇంకా సమసిపోలేదా.? అంటే అవుననే సమాధానమే వస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. దాసరి నారాయణ రావు గారి మరణం తర్వాత ఆస్తిలో వాటాల కోసం అన్న‌ద‌మ్ములైన ప్ర‌భు- అరుణ్ కుమార్ ల మ‌ధ్య నిత్యం గొడ‌వ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా దాసరి పెద్ద కొడుకు ప్ర‌భు త‌న‌కు తన త‌మ్ముడి వ‌ల్ల ప్రాణ‌హాని ఉంద‌ని సోషల్ మీడియాలో చెబుతూ..

తమ్ముడు దాసరి అరుణ్ కుమార్ అర్థరాత్రి నా ఇంటి గోడ దూకి లోపలికొచ్చి, ఇంట్లోని బీరువా గ‌దిలోకి వెళ్లి ప‌త్రాలు త‌నిఖీ చేశాడ‌ని సంచలనం సృష్టించారు. ఈ వివాదంలో త‌మ్ముడిపై దాసరి ప్రభు పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. తనింట్లోని బీరువా తలుపులను బలవంతంగా తెరిచి పత్రాలను తనిఖీ చేయడం చూస్తుంటే అరుణ్ కుమార్ కేవలం ఆస్తి కోస‌మే ఇదంతా చేస్తున్నారడంటూ దాసరి ప్రభు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తెలియపరచడం విశేషం. ఇందుకు సాక్ష్యంగా సీసీటీవీ పుటేజ్ కూడా ఉందని, తమ ఇద్దరిమధ్యా వున్న ఆస్తి తగాదా గురించి గతంలో చాలామంది సినీ ప్రముఖుల వద్దకు వెళ్లి చెప్పానని కానీ ఎవ్వరూ ఈ విషయంలో జోక్యం చేసుకోలేదని, ఇప్పటికైనా ఈ వివాదంపై స్పందించి టాలీవుడ్ ప్రముఖులైన మోహ‌న్ బాబు, ముర‌ళీ మోహ‌న్, సి.క‌ల్యాణ్ వంటివాళ్ళు ఈ స‌మ‌స్యకు ప‌రిష్కారం చూపించాల‌ని దాస‌రి ప్ర‌భు కోరారు.

దీనిపై దాసరి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఎస్ఐ సమక్షంలోనే తాను ఇంట్లోకి వెళ్లానని. గేటు దూకిన సమయంలో తాను మద్యం తీసుకోలేదని తెలిపారు. అయితే తనకు ఇదేమి కొత్ఇంత కాదని ఇంతకు ముందు కూడా తాను ఎన్నో సార్లు గేటు దూకి ఇంట్లోకి వెళ్లిన స్పష్టం చేసారు. అంతేకాదు తన ఇంటి గేటును తాను దూకితే ఎలాంటి తప్పులేదంటూ సమర్ధించుకున్నాడు. ఆ ఇల్లు ఉమ్మడిలో ఉందని. తన అన్నయ్య ప్రభు కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, ఒకవేళ ఆయన ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే నిరూపించాలన్నారు.

సోషల్ మీడియాలో రోజు రోజుకీ వైరల్ గా మారుతున్న దాసరి ప్రభు కామెంట్స్ ను చూసిన కొందరు సినీ పెద్దలు టాలీవుడ్ దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు గారి ప‌రువు తీసేందుకే ఒక‌రితో ఒక‌రు పోటీ ప‌డుతున్నారంటూ చర్చించుకుంటున్నారు. ఒక అగ్ర దర్శకుని వారసులుగా అన్న‌ద‌మ్ములిద్దరూ ఇలా ఆస్తి కోసం బజారుకెక్కడం సరికాద‌ని దాసరి ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. అదండి సంగతి.. మొత్తానికి మాన‌వ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేన‌ని దాస‌రి నారాయణ రావు గారి సుపుత్రుల విష‌యంలో ఋజువైందన్నమాట. ‘పండిత పుత్ర ప‌ర‌మ షుంటః” అంటే ఇదేనేమౌ.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here