టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య (89) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈరోజు ఉదయం 6 గంటలకు ఆసుపత్రిలో అయన మరణించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో క‌మ్ముల శేషయ్య గారి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న ప‌లువు‌రు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల శేఖ‌ర్ క‌మ్ముల‌ను ఫోన్ లో ప‌రామ‌ర్మించారు.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నావ్ విషయం తెల్సిందే.. ఈ చిత్ర షూటింగ్ చాలా వరకు పూర్తిఅయిపోయినట్టు తెలుస్తుంది. కాగా కరోనా నేపథ్యంలో షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here