అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిత్యం ఎదో ఒక వివాదాస్పద వ్యాఖలు చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఎవరిని పోగుతారో.. ఎవరిని తిడుతారో ఎవరు ఊహించలేరు. అయన వ్యవహార శైలిపై ఇప్పటికే చాలా దేశాలు గుర్రుగా ఉన్నాయి. అయితే తాజగా అయన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీద విరుచుకుపడుతున్నారు. డబ్ల్యూహెచ్ఓ తప్పుడు సమాచారం ఇచ్చి నిజంగా తమను మోసం చేసింది అని మండిపడుతున్నారు ట్రంప్.

చైనాలో కరోనా విజృంభిస్తున్న వేళ చైనీయులను అమెరికాలోని అనుమతించవచ్చు అంటూ డబ్ల్యూహెచ్ఓ తమకు ప్రతిపాదనలు చేసిందని ఆరోపించారు. ఇటువంటి తప్పుడు సహాలాహాలు ఎందుకు ఇచ్చారు అంటూ ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. అమెరికా నుంచి పెద్ద మొత్తంలో నిధులు తీసుకుంటున్నాకూడా డబ్ల్యూహెచ్ ఓ చైనాకు అనుకూలంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇకనుంచి డబ్ల్యూహెచ్ఓ కు అమెరికా పంపించే నిధులను ఉపసంహరించుకుంటామని బెదిరించారు ట్రంప్. అయితే ఇప్పటి వరకు ట్రాంప్ వ్యాఖ్యలపై ఎటువంటి సమాధానం ఇవ్వలేదు డబ్ల్యూహెచ్ఓ. మరి ట్రంప్ వ్యాఖ్యలపై వీరు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరో పక్క అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. 3 లక్షల 80 వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. మృతుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. 11,907 మంది ఇప్పటి వరకు మృత్యువాత పడ్డారు. నిన్న ఒక్కరోజే 13,740 పాజిటివ్ కేసులు నమోదవడం చుస్తే అక్కడ కరోనా వైరస్ ఎటువంటి బీభత్సం సృష్టింస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here