ప్రతి భార్య భర్తను కోరవలసిన హక్కులు

0
337

ప్రతీ కుటుంబంలో స్రీ పాత్ర ఎంతో విలువైనది. ఇంటి ఇల్లలి పాత్రను వేరెవ్వరు భర్తీ చేయలేరు. జరగరానిది జరిగితే, ఆర్ధిక ఇబ్బందులు ఎదురైతే ఆ ఇంటి ఇల్లాలు ఎంతో సతమతమవుతుంది. ముఖ్యం గా భర్తపై ఆధారపడిన ఇల్లాలి పరిస్థితి మరింత దుర్భరం. అందుకే కుటుంబానికి ఆధారంగా ఉన్న ప్రతీ భర్త తన కుటుంబం కోసం కొన్ని రకాల ముందు జగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి ఇల్లాలు సైతం ఈవిషయంలో అవగాహనతో ఉండాలి. భర్త మరచినా లేదా అలసట వహించినా తానే భాధ్యత తీసుకుని తన కుటుంబానికి భరోసా కల్పించాలి. అందుకే ఎమిచేయాలన్నది చూద్దాం.

 

భర్త చేసే అన్ని రకాల పెట్టుబడుల గురించి భార్యకి తెలియడం ఎంతో అవసరం. స్టాక్ మార్కెట్ లొ పెట్టుబడులు కానీయండి, మ్యుచువల్ ఫండ్స్ మరియు ఫిక్సెడ్ డిపాజిట్లు ఇలాంటివన్నీ మహిళ సైతం ఈ పెట్టుబడి సాధనాల గురించి, వాటి రాబడులు మరియు ఇతర విషయాలగురించి పూర్తిగా అర్ధం చేసుకోవడం కూడా తప్పనిసరి దీనివల్ల భర్త దూరమైతే ఆయా అర్ధిక విషయాలు, పెట్టుబడుల సాధనాల నిర్వహణను ఆమే తేలికగా నిర్వహించగలుగుతుంది. ముఖ్యంగా వివహమైన వారు, కుటుంబ పోషన చూస్తున్న పురుషులు తమపేరిట ఉన్న అన్ని రకాల పెట్టుబడి సాధనాలకు, భీమ పోలసీలకు నామినీగా భార్య పేరును రిజిస్టర్ చేయించడం ఎంతో అవసరం. బ్యాంక్య్ ఖాతాలు, ఈఖ్విటీ లింకెడ్ సేవింగ్స్ పధకాలను, ఫిక్సెడ్ డిపొజిట్ లలో ఇలా అన్నిటిలోనూ నామినీ పేరు పేర్కొనడం అవసరం.

 

భార్యా భర్తలిద్దరు జాయింట్ బ్యాంక్ ఖాతాను నిర్వహించడం ఎంతో అవసరం. ప్రతి ఇల్లాలు జాయింట్ ఖాతా తెరుద్దామని తమ భర్తను కోరాలి. జాయింట్ అకౌంట్ వల్ల ఎన్నో ప్రయొజనాలు ఉన్నాయి. అన్ని రకాల ఖార్చులను పరిశీలించే అవకాసంతో పాటూ, ఇద్దరూ ఖాతాను నిర్వహించుకునే స్వేచ ఉండడం అనుకూలం. ఒకవేల ముందుగా ఒకరు మరణిస్తే ఖాతాపై హక్కులు వెరొకరికి శులభంగా బదిలీ అవుతాయి. మీరు ఆహార పరమైన జాగ్రత్తలు తీసుకున్న సంపూర్ణ ఆరొగ్యంగా ఉండగలరన్న భరోసా లేదు. వైధ్య భీమా లేకపోతే కుటుంబానికి ఆధారమైన వ్యక్తి తీవ్ర అనారొగ్యం పాలైనప్పుడు, ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరినప్పుడు, ఆకుటుంబం పొదుపు మొత్తం హరించుకుపోయే పరిస్తితి ఉంది. అందుకే తగినంత కవరేజీతో పొదుపు భీమా ఉంటే పొదుపు ఖర్చైపొకుండా ఉంటుంది. వైద్య భీమా ఉంటే నగదురహిత చికిత్సలను, ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులను భీమ సంస్తే భరిస్తుంది.

 

తమపిల్లలకు మెరుగైన విధ్య ని అందించాలని అందరూ భావిస్తారు. విధ్యా వ్యాయాలు ఎటేటా బాగా పెరిగిపోతున్నాయి. స్కూలులు ఫీజులను గనణీయంగా పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో ఖరీదైన విధ్యను అందించడం అన్నది ఓ కటిన లఖ్ష్యమే అవుతుంది. మరి ఇలాంటి పరిస్తితులలో కుటుంబానికి ఆధారమైన వ్యక్తి దూరమైతే పిల్లల విధ్యా భారాన్ని మోసేదెవరు? అందుకే తాను లేకపోయినా పిల్లల విధ్య ఆగిపోకుండా ఉండేందుకు చైల్డ్ ఇన్సురన్స్ పాలసీని తీసుకుంటే రక్షణగా నిలుస్తాయి. ఈపాలసీలు ప్రమానగతంగా పాలసీ పెర్కోన్న మేరకు చెల్లింపులు చేస్తాయి. పైగా భవిష్యత్తు ప్రీమియము ల చెల్లింపులు సైతం మొత్తం రద్దవుతాయి. పాలసీ పిల్లల విధ్య పూర్తయ్యె వరకు లేదా పాలసీ గడువు పూర్తయ్యెవరకు ఉంటాయి. అందుకే పిల్లల పేరిట పాలసీ తీసుకోవాలని ప్రతీ గ్రుహిని తన భర్తను కోరడం ఎంతో మంచిది.

 

కుటుంబానికి అధారమైన భర్త మరణిస్తే అతని పేరిట ఉన్న ఆస్తులన్నీ సరైన వారి చేతులలోకి వెళ్ళాలి. ఇల్లు లేదా షాపూ, బంగారం ఏవైనా సరే వీటిపై కుటుంబ సభ్యులకు హక్కులుంటాయి. ఇలాంటి పరిస్తితులలొ విల్లు రాసి ఉండడంవల్ల పని సులువవుతుంది. అందుకే విల్లు రాయల్సిన అవసరం ప్రతి భర్తపై ఉంటుంది. అందులో తన భార్య, పిల్లల పేర్లను పెర్కొనాలి. ఈ ఆస్తులన్నవి కుటుంబ భవిష్యత్తు అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగపడతాయి. ఇలా విల్లు లేని సంధర్బాలలో సంబందిత ఆస్తులపై హక్కులకోసం న్యయస్థానలను ఆశ్రయించాల్సి వస్తుంది. కానీ ఇది సుదీర్గమైన కాలహరణ ప్రక్రియా అన్నది మనందరికీ తెలిసిందే కదా.

 

పెట్టుబడులకు సంబందించిన అన్ని రకాల డక్యుమెంట్లు, అలాగే ఆస్తులు, రుణాలు సంబందించిన అన్ని డాక్యుమెంట్ల గురించి ఇంటి ఇల్లాలు తప్పకుండా తెలుసుకోవాలి. లెకుంటే భర్త మరణం సంధర్బంలో అవి లభించకుంటే భారీగా నస్టపోవాల్సి ఉంటుంది. కీలకమైన డాక్యుమెంట్లు అన్ని టిన్నింటినీ ఒక ట్రాకులో పెట్టడం మంచిది. పాస్వర్డ్ లు అన్నవి చాల సున్నతమైనవి, కీలకమైనవి, అవి పడరాని వారి చేతిలో పడితే పెద్దనస్టమే కలుగుతుంది. కానీ భార్యా భర్తల విషయాలలో ఇటువంటి సందేహాలు అవసరంలేదు. పెట్టుబడులు ఎలెక్త్రానిక్ రూపంలో ఉన్నప్పుడు పాస్వర్డ్ లు ఎంతో ఉపయోగపడతాయి.

 

షేర్లు, మ్యుచూల్ ఫండ్స్ వంటివి మరియు భార్యా భర్తల మధ్య ఆర్దిక విషయాలలో దాపరికాలు లేకుండా సమగ్రంగా తెలుసుకోవడం, నామినీగా ఒకరికి మరొకరు వ్యహరించడం, కుటుంబానికి ఆర్దిక పరమైన రక్షన కల్పించడం ప్రతి ఒక్కరు కర్తవ్యంగా భావించాలి. ఆర్ధిక విషయాలలో ఇల్లాలిని తలదూర్చవద్దనడం పూర్తిగా తప్పే అవుతుంది. ఆమే ప్రతీది అర్ధం చేసుకోలెకపోయినా సరే, ఆర్దిక వ్యవహారాలలో భాగం చేయడం వల్ల ఎంతో కొంత తెలుసుకుంటుంది. రేపు భర్త దూరమైన పరిస్తితి వస్తే ఆకాస్త ఆర్ధిక పరిగ్ణానమే ఆమెకు ఉపయోగపడుతుంది. అందుకే భర్త చెప్పకపొయినా, చొరవ తీసుకోకపోయినా ప్రతీ గ్రుహిని తానే ఆసక్తితో భర్తనుంచి అన్ని ఆర్దికపరమైన విషయాలు తెలుసుకోవాలి. విజ్ఞానం ఎప్పుడు ఎప్పుడూ వృధా కాదు. ఇలా నేర్చుకున్న సమాచారం ఇవాలకాకపోయినా రేపైనా తగిన విధంగా ఉపయోగపడుతుంది.

 

మరిన్ని వివరాలకోసం ఈ విడియో చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here