12 దేశాల టీచర్ల తో పోటీ పడి గ్లోబల్ అవార్డు గెలిచిన ఉపాద్యాయుడు !!

0
213

ఒక మారుమూల గ్రామంలో ఉన్న స్కూల్ లో పనిచేస్తున్న ఒక మాస్టారు అద్భుతాలు సృష్టిస్తే.. ప్రపంచానికి మన ఇండియా సత్తా ఏంటో చూపిస్తే.. మంచి కిక్కు వస్తుంది కదా.. నిజమండి బాబు ఈయన గురించి తెలుసుకుంటుంటే నిజంగా మనందరికి కిక్కుతో పాటు లైఫ్ లో మనం కూడా ఏదోకటి సాధించాల్రా అని అనిపిస్తోంది. ఇంతకీ ఆయనెవరో అయన స్టోరీ ఏంటో చెప్పలేదు కదా.. ఇప్పుడు తెలుసుకుందాం.. రంజిత్ సింహ్ డిస్లె అనే పేరు ఎప్పుడైనా విన్నారా.. వినలేదు కదా ఈ పేరును ఫ్యూచర్ లో కచ్చితంగా వింటాం వినటమే కాదు ముందు ముందు తరాలు ఈయన గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. గ్లోబల్ 2020 విన్నర్ గా నిలిచిన రంజిత్ మహారాష్ట్రా, సోలాపూర్ జిల్లాలోని పరిత్ వాడే అనే ఊరిలో ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా పని చేస్తున్నాడు. ఇతను సాధించిన మొట్టమొదటి ఘనత ఏంటంటే ప్రపంచ దేశాలకు చెందిన 12 మంది గొప్ప గొప్ప టీచర్లతో పోటీపడి నోబుల్ ప్రైస్ లాంటి గ్లోబల్ టీచర్ ప్రైజ్ ను గెలుచుకున్నాడు. ఈ ప్రైజ్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు కూడా ఇతనే. ఒక సాధారణ గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా పాఠాలు చెప్పుకునే రంజిత్ కి అసలు ఈ అవార్డు ఎలా వచ్చింది అనే కదా మీ డౌట్.. ఈయన ఈ ప్రైజ్ గెలవడానికి అతని పనిచేస్తున్న స్కూలే కారణం.. అది ఎలాగంటే..

మనం ఇందాక చెప్పుకున్నట్టు రంజిత్ గారిది మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా. ఈయనకు ఇంజనీర్ కావాలనే కోరిక ఉండేది.. కానీ రంజిత్ వాళ్ళ నాన్నగారు నువ్వు టీచర్ అయి నలుగురికి చదవు చెప్తుంటే చూడాలని వుంది అని కోరడంతో ఇంజనీరింగ్ కల పక్కన పెట్టి గవర్నమెంట్ టీచర్ అయ్యాడు. అదే రంజిత్ జీవితాన్ని మార్చేసింది. 2009లో రంజిత్ కి ఉద్యోగం రావడంతో మొదటి రోజే స్కూల్లో జాయిన్ అవుదామని పోస్టింగ్ వచ్చిన పరిత్ వాడ అనే చిన్న గ్రామానికి వెళ్ళాడు.

కానీ అతను ఎంతో ఆశతో పాఠాలు చెబుదామని వెళ్లిన స్కూల్ కదిలిస్తే పడిపోయేలా ఉన్న ఒక పాత బిల్డింగ్.. దాని పక్కనే ఒక పశువుల కొట్టం, పాతబడ్డ గుడౌను ఇలా ఏదో మార్కెట్ లా ఉందట.. అప్పుడు రంజిత్ గారు అక్కడ పరిస్థితిని అర్ధం చేసుకొని ఆ ఊరి పెద్దలను బతిమలాడి ఆ స్కూల్ ని బాగు చేపించాడు. అక్కడ చదవుకునే పిల్లలను క్రమశిక్షణలో పెట్టాడు..ఇంకా ఈ స్కూల్ కి చుట్టుపక్కల ఊరిలోని జనాలందరు కన్నడ భాషే మాట్లాడేవారు..కానీ మన పుస్తకాలన్నీ సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉండడం వలన అక్కడ పిల్లలు ఎక్కువమందికి ఇవి అర్ధంకాక స్కూల్ మానేస్తున్నారని అర్ధం చేసుకొన్న రంజిత్ వేరే భాషలో ఉన్న పాఠాలను లోకల్ లాంగ్వేజ్ లోకి ట్రాన్సలేట్ చేసాడు. అంతటితో ఆగకుండా ఆ పుస్తకాల్లోని పాఠాలు ఇంకా సులువుగా అర్ధం అవ్వడం కోసం ఆయనే స్వయంగా ఆ పాఠాలను వీడియోస్ మరియు ఆడియోస్ రూపంలోకి మార్చాడు.

అంతేకాదు ఈయన ఇంజినీర్ అవ్వాలనుకున్నాడు కాబట్టి రంజిత్ కి టెక్నాలజీ మీద కూడా మంచి పట్టు ఉంది..దాన్ని ఉపయోగించి ఇండియా లోనే మొదటి సారి ప్రైమరీ క్లాసు నుంచి ప్రతి పుస్తకానికి క్యూఆర్ కోడ్ ను యాడ్ చేసాడు. స్టూడెంట్స్ ఈ కోడ్ ను స్కాన్ చేస్తే చాలు బుక్స్ ఓపెన్ చేయకుండా పుస్తకంలోని పాఠాలు అన్ని వీడియో రూపంలో ప్లే అయ్యేలా సెట్ చేసాడు. అలాగే పుస్తకాలకు క్యూఆర్ కోడ్ ను యాడ్ చేసిన మొదటి స్కూల్ కూడా రంజిత్ పనిచేస్తున్న స్కూలే కావడం విశేషం. దాంతో మొట్టమొదటిసారి ఈ క్యూఆర్ కోడ్ సక్సెస్ గురించి తెలుసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో చుట్టుపక్కల ఉన్న అన్ని స్కూల్స్ లో ఈ క్యూఆర్ కోడ్ అమలు చేస్తామని ప్రకటించింది. అంతేకాదు సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా ఈ విద్యా విధానాన్ని అభినందించింది. ప్రస్తుత ఈయన 11 దేశాలలో ఉన్న స్కూల్స్ కోసం క్యూఆర్ కోడ్ పుస్తకాలను తయారు చేస్తున్నాడు. అలా 2009లో మొదలైన ఆయన ప్రయాణం గత 11 సంవత్సరాలుగా దేశాలు దాటి మరీ పరుగెడుతూనే ఉంది. స్టూడెంట్స్ కి చదువు మీద ఇంట్రెస్ట్ ని పెంచడం కోసం “వర్చుయల్ ఫీల్డ్ ట్రిప్” అనే ప్రాజెక్ట్ ను ఈయన స్టార్ట్ చేసాడు. ఈ ప్రాజెక్టులో భాగంగా అతని స్కూల్లో చదివే పిల్లలు వేరే దేశంలో ఉన్న పిల్లలతోటి ఆన్లైన్ లో డైరెక్ట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడతారు. అలా లోకల్ భాష కన్నడ తప్ప ఇంకే భాషలు తెలియని ఆ చుట్టుపక్కల పిల్లలకు అన్నిటిని పరిచయం చేసి సక్సెస్ అయ్యాడు రంజిత్. అంతేకాదు ఈయనకు ఆడపిల్లలను చదవించడం అంటే చాలా ఇష్టమట..ప్రతి ఇంటికి వెళ్లి మీ ఆడపిల్లలను చహెచ్డీవించండి అంటూ వాళ్ళ ఇంట్లోవారిని బతిమాలేవారట.

అంతేకాదు ఈయన ఎవ్వరు సాధించలేని గ్లోబల్ టీచర్ ప్రైజ్ కూడా గెలుచుకున్నాడు..అయితే అసలేంటి ఈ గ్లోబల్ టీచర్ ప్రైజ్ అనేదాని గురించి ఒకసారి మాట్లాడుకుంటే వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ చూపిన వారికి నోబెల్ ప్రైస్ ఎలా అయితే ఇస్తారో, టీచింగ్ లో అద్భుతమైన కృషి చేసినవారికి గ్లోబల్ టీచింగ్ ప్రైజ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ ప్రైస్ ను వర్కి ఫౌండేషన్, ఐక్యరాజ్యసమితి, యునెస్కో ఈ మూడు కలిసి ఇవ్వడం జరుగుతుంది. 2015 నుంచి దీన్ని ఇవ్వటం మొదలు పెట్టారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన గొప్ప గొప్ప టీచర్లు ఈ ప్రైస్ కోసం పోటీ పడతారు. ఈసారి కూడా 140 దేశాలకు చెందిన 12 వేల మంది టీచర్లు ఈ ప్రైజ్ కోసం నామినేట్ అయ్యారు. ఈ 12 వేల మంది టీచర్లను ఫిల్టర్ చేసి అందులో నుంచి ఒక పది మందిని సెలెక్ట్ చేశారు. అందులో అద్భుతమైన ప్రతిభ కనబరిచి రంజిత్ విజేతగా నిలిచాడు. ఏదైనా రంజిత్ గారు మీరు గ్రేట్ అండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here