యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. ఇక వాటికి డబ్బులే డబ్బులు..!

0
55

యూట్యూబ్ అంటే తెలియని వారుండరు. అంతగా పాపులరిటీ ఉంది దానికి. కొన్ని కోట్లు వీడియోలు అందుటో ఉంటాయి. మనకు కావాల్సిన ప్రతీ సమాచారం దొరుకుతుంది. దీనిలో కంటెంట్ ను అప్ లోడ్ చేసే వీడియోలకు వ్యూస్ ఆధారంగా డబ్బులు అందజేస్తుందని తెలిసిందే. టిక్ టాక్ కూడా ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. దానిని బ్యాన్ చేయడంతో చాలామంది నిరుత్సాహపడ్డారు.

అయితే దానికి పోటీగా మరో ప్రత్యామ్నంగా యూట్యూబ్ షార్ట్స్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. వీటికి కూడా డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్న సంగతి తెలిసిందే. ఈమేరకు తాజాగా షార్ట్స్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్‌న్యూస్ తెలిసింది. వాళ్లకు కూడా ప్రోత్సాహకాలను అందించనున్నట్లు ప్రకటించింది.

దీనిని కోసం 100 మిలియన్ డాలర్ల ఫండ్ ను కూడా ఏర్పాటు చేశారు. 2021-22 మధ్య వైరల్ గా మారిని వీడియోలకు ఈ ఫండ్ అందించనుంది. ఈ ఆగస్టు నుంచే ఈ రివార్డులను అందించనున్నారు. అత్యధికంగా వ్యూస్ వచ్చిన వీడియోలకు ఈ రివార్డులు లభించనున్నాయి. అంతేకాకుండా బోనసలను కూడా ప్రకటించనుందంట.

వ్యూస్ కు సంబంధించి వీడియోల్లో కనీసంగా చూసే వ్యూస్ ఉంటుంది. దానాని క్వాలిఫై కాకున్నా.. వచ్చే నెలలో అర్హత సాధించినా ఈ రివార్డులను పొందవచ్చు. దీనిలో ఆర్హత పొందాలంటే 180 రోజుల్లో షార్ట్ వీడియోను అప్‌లోడ్ చేసి ఉండాలి. వీడియో ఎక్కడా కాపీ ఉండకుండా ఒరిజనల్ అయి ఉండాలి. 18 ఏళ్లు కచ్చితంగా నిండి ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here