నటుడు శివాజీ సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే.. ఆయనకు తెలుగు ప్రజలు అన్నా.. తెలుగు జాతి అన్నా ఎంతో అభిమానంతో తెలుగు ప్రజల మేలు కోసం పోరాటం చేయడానికి ఆయన రాజకీయాల్లోకి వెళ్లారు.. పార్టీ లకు ఆతితంగా తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి శివాజీ.. ఆంధ్ర తెలంగాణ విడిపోయాక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలుగు ప్రజలు అందరు కోరడం జరిగింది.. ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చి 6 సంత్సరాలు దాటిన ఇప్పటికీ దాని గురించి ఆలోచించడం లేదు..

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారు.. శివాజీ కూడా ప్రత్యేక హోదా కోసం మోడీ గారితో కూడా చర్చలు జరిపి బీజేపీ పార్టీ లో చేరి ఆంధ్రరాష్ట్రం తరుపున పోరాడారు.. శివాజీ ఒక న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో నేను రాజకీయల్లోకి వచ్చిందే ఆంధ్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడం కోసం అని స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వచ్చేవరకు పోరాడతానని, దాని కోసం చంద్రబాబు చేసిన ప్రత్యేక హోదా పోరాట దీక్షలో కూడా నిలబడతానని, అదే విధంగా ఇపుడు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన ఆయన తో కూడా కలిసి నడుస్తా అని చెప్పుకొచ్చారు.. కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని దానికోసం మేము పార్టీలకు ఆతితాంగా కృషి చేస్తాను అని ఆయన చెప్పారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here